SSC Paper Leak | ఇది లీకేజీ కాదు.. ఫక్తు రాజకీయం .. విద్యావేత్తల ఆగ్రహం
SSC Paper Leak | విద్యార్థులంతా తమకు కేటాయించిన గదుల్లో ఇన్విజిలేటర్ల పర్యవేక్షణలో పరీక్ష రాస్తుంటే.. ప్రశ్న పత్రాలు బయట వాట్సాప్ గ్రూపులలో చక్కర్లు కొట్టడం వల్ల ఎవరికి ఉపయోగం? ఇది లీకేజీ కాదు.. ఫక్తు రాజకీయమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
SSC Paper Leak | హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): విద్యార్థులంతా తమకు కేటాయించిన గదుల్లో ఇన్విజిలేటర్ల పర్యవేక్షణలో పరీక్ష రాస్తుంటే.. ప్రశ్న పత్రాలు బయట వాట్సాప్ గ్రూపులలో చక్కర్లు కొట్టడం వల్ల ఎవరికి ఉపయోగం? ఇది లీకేజీ కాదు.. ఫక్తు రాజకీయమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పదో తరగతి పరీక్ష ప్రారంభమయ్యేది ఉదయం 9.30 గంటలకు. విద్యార్థులను అరగంట ముందే అంటే 9 గంటలకే పరీక్షా కేంద్రంలోకి అనుమతించి, 9:15కు వారికి కేటాయించిన గదులలోకి పంపుతారు. సరిగ్గా 9:30 గంటలకు బెల్ మోగగానే ఇన్విజిలేటర్లు విద్యార్థులకు ప్రశ్నపత్రాలు ఇస్తారు. ఉదయం 9:45 గంటలకు ప్రశ్నపత్రం వాట్సాప్లో బయటికొస్తే లోపల పరీక్ష రాసే విద్యార్థికి ఏం ప్రయోజనం? పోనీ ఆలసల్యంగా వచ్చే విద్యార్థుల కోసం అనుకుందామా అంటే.. వారిని ఉదయం 9:30 గంటల తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించారు.
అలాంటప్పుడు బయటినుంచి ఎవరైనా పరీక్షా కేంద్రంలోనికి వెళ్లాలి లేదా సెల్ఫోన్ల ద్వారా బయటి వ్యక్తులు జవాబులు చేరవేయాలి. ఇది సాధ్యమయ్యే పనేనా అంటే అస్సలు కాదు. మరి ప్రశ్నపత్రాలు ఎవరి కోసం వెళ్తున్నట్టు.. ఎందుకోసం వెళుతున్నట్టు అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. పరీక్షరాసే విద్యార్థులంతా గదుల్లో ఇన్విజిలెటర్ల పర్యవేక్షణలో ఉన్నప్పుడు ప్రశ్నపత్రాలు వాట్సాప్లో మీడియాకు, రాజకీయ నేతలకు వెళ్తే దేనికోసం, ఎందుకోసం వెళ్తున్నట్టు? ఎవరి ప్రయోజనాల కోసం బయటకొస్తున్నట్టు.. అంటే.. ఇది లీకేజీ కాదు ఫక్తు రాజకీయమే. దీని వెనుక కుట్ర ఉన్నదన్నది నిజం. బద్నాం చేయాలన్న కుయుక్తులు దాగి ఉన్నాయన్నది వాస్తవం.
రాజకీయ లాభం కోసమే
ప్రశ్నపత్రాలు వాట్సాప్లో రావడం వెనుక రాజకీయ లాభం తప్ప మరేమీలేదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వ పరీక్షల విభాగం మాజీ డైరెక్టర్ మన్మథరెడ్డి మాట్లాడుతూ.. తాను నాలుగేండ్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్గా పనిచేశానని, పేపర్ సెట్టింగ్ నుంచి పరీక్షాకేంద్రాలకు ప్రశ్నపత్రాలను చేర్చే వరకు 100 రకాల జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పారు. ఈ ప్రక్రియలో లీకేజీలకు ఆస్కారముండదని, కొన్ని తప్పిదాల వల్లే పరీక్షాకేంద్రాల నుంచి మాత్రమే ప్రశ్నపత్నాలు బయటికొస్తున్నాయని తెలిపారు.
డిస్మిస్ చేయడం ఇదే తొలిసారి..
ప్రశ్నపత్రాలు వాట్సాప్లో ప్రత్యక్ష్యం కావడంపై విద్యాశాఖ చాలా సీరియస్గా స్పందించింది. టీచర్లు బందప్ప, సమ్మప్ప, సబియా మదహత్లను అధికారులు ఏకంగా ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులను సస్పెండ్ చేశారు. గతంలో ఇలాంటివి జరిగితే టీచర్లను సస్పెండ్ చేసిన దాఖలాలున్నాయి. ఇలా డిస్మిస్ చేసిన సంఘటనలు చాలా తక్కువ.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

