TREIRB | గురుకులాల్లో ఉద్యోగాల భర్తీ.. దరఖాస్తుల ఎడిట్‌కు అవకాశం
TREIRB | హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల విద్యాలయాల సొసైటీ పరిధిలో ఖాళీగా ఉన్న 9,231 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఇందులో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఉండగా, అర్హత గల అభ్యర్థులు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు.
TREIRB | హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల విద్యాలయాల సొసైటీ పరిధిలో ఖాళీగా ఉన్న 9,231 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఇందులో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఉండగా, అర్హత గల అభ్యర్థులు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. అయితే అభ్యర్థులకు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది గురుకుల నియామక బోర్డు. అభ్యర్థులు ఒకసారి మాత్రమే తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసిన దరఖాస్తులను ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోవాని సూచించారు.
జూనియర్ లెక్చరర్స్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రరీయన్, పీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు జూన్ 14 నుంచి 19వ తేదీ మధ్యలో తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. డిగ్రీ కాలేజీలకు సంబంధించిన లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రరీయన్, లైబ్రరీయన్(స్కూల్స్), ఫిజికల్ డైరెక్టర్(స్కూల్స్), డ్రాయింగ్, ఆర్ట్ టీచర్లు, క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్, క్రాఫ్ట్ టీచర్, మ్యూజిక్ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారు జూన్ 20 నుంచి 24వ తేదీ మధ్యలో ఎడిట్ చేసుకోవచ్చు. టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జూన్ 25 నుంచి 30వ తేదీ మధ్యలో తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

