బలరాంనాయక్‌పై ఈసీ వేటు

హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్, సీపీఐ అభ్యర్థి కల్లూరి వెంకటేశ్వరరావుపై ఎన్నికల సంఘం అనర్హత వేటువేసింది. 2019 ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన బలరాంనాయక్ తన ఖర్చుల లెక్కలను నిర్ణీత వ్యవధిలో ఎన్నికల సంఘానికి సమర్పించలేదు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆయనపై అనర్హత వేటు వేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ గెజిట్ విడుదల చేశారు. బలరాంనాయక్ మూడేండ్ల పాటు పార్లమెంటు ఉభయసభలకు, శాసనసభకు, శాసనమండలికి పోటీ చేసే అర్హతను కోల్పోయినట్టు ఈసీ తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Balaram Naik
- Congress
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

