‘ఎర్లీ బర్డ్’కు విస్తృత ఆదరణ

- రూ.122 కోట్ల ముందస్తు ఆస్తి పన్ను వసూలు
- 2.77 లక్షల మంది యజమానులకు రూ.6.1 కోట్లు ఆదా
హైదరాబాద్, జూన్ 2 ( నమస్తే తెలంగాణ ): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఎర్లీ బర్డ్’ స్కీంకు విస్తృత ఆదరణ లభించింది. ఫలితంగా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల పరిధిలో రూ.122 కోట్ల ముందస్తు ఆస్తి పన్ను వసూలైంది. దీని ద్వారా 2.77 లక్షల మంది ఇంటి యజమానులకు రూ.6.1 కోట్లు ఆదా అయింది. ‘ఎర్లీ బర్డ్’ స్కీం కింద ముందస్తుగా వార్షిక ఆస్తి పన్ను చెల్లించినవారికి రాష్ట్ర ప్రభుత్వం 5 శాతం రాయితీ ఇస్తుండటంతో చాలా మంది ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 129 మున్సిపాల్టీలు, 12 కార్పొరేషన్ల పరిధిలోని 14.20 లక్షల మంది ఇంటి యజమానులు రూ.469.43కోట్లు చెల్లించేందుకు అర్హులు కాగా.. మే నెలాఖరు నాటికి 2.77 లక్షల మంది యజమానులు రూ.122.31 కోట్లు చెల్లించారు. మొత్తంగా 26 శాతం యజమానులు ముందుస్తుగా ఆస్తి పన్ను చెల్లించారు. గతేడాది ‘ఎర్లీ బర్డ్’ స్కీం ద్వారా రూ.124 కోట్లు వసూలయ్యాయి. ఈ వసూళ్లలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వరుసగా మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. ఆ నగరంలో 32,147 మంది యజమానులు రూ.13.98 కోట్ల ముందస్తు పన్ను చెల్లించారు. వరంగల్ తర్వాతి స్థానాల్లో నిజాంపేట (రూ.8.32 కోట్లు), కరీంనగర్ (రూ.5.63 కోట్లు), నిజామాబాద్ (రూ.5.16 కోట్లు) కార్పొరేషన్లు ఉన్నాయి. జీహెచ్ఎంసీ మినహా మిగిలిన కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో ఈ పథకం గడువు మే 31తో ముగిసింది. వాస్తవానికి ఈ ఏడాది ఈ పథకం గడువు ఏప్రిల్ నెలాఖరుతోనే ముగియాల్సి ఉన్నప్పటికీ కరోనా నేపథ్యంలో మే నెలాఖరు వరకు పొడిగించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణి కన్నీళ్లు.. అమన్, ముఖేష్‌లకు నాగార్జున గట్టి క్లాస్,త్రిగుణ్‌కు షాక్!
Deeksha Divas | నేడు చలో కరీంనగర్.. అల్గునూరులో మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం
Caste Census | కులగణనపై అనుమానాలెన్నో.. దేశవ్యాప్తంగా నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితి
Evening Court | ఈవెనింగ్ కోర్టులు వద్దు.. హైకోర్టు యాక్టింగ్ సీజేకి బార్ అసోసియేషన్ల సమాఖ్య వినతి
RTC Merger | అటకెక్కిన ఆర్టీసీ విలీనం.. మూడేండ్లు కావొస్తున్నా నెరవేరని హామీ!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

