హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్, ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎప్‌సెట్‌కు దరఖాస్తులు చాలా మందకొడిగా వస్తున్నాయి. బుధవారం నాటికి మొత్తం 15,355 దరఖాస్తులు వచ్చినట్టు కన్వీనర్ ప్రొఫెసర్ డీన్‌కుమార్ తెలిపారు. ఇంజినీరింగ్‌కు 9,714, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి 5,631 దరఖాస్తులు వచ్చినట్టు వివరించారు.