అమీర్‌పేట్, అక్టోబర్ 5: దసరా పండుగ వేళ మీ ప్రియమైన వారిని బహుమతులతో సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాలనుకుంటున్నారా? కారును బంపర్ ప్రైజ్‌గా గెలుచుకోవాలనుకొంటున్నారా? ప్రతిరోజూ స్మార్ట్ టీవీ, మొబైల్ ఫోన్, కిచెన్వేర్, రూ.5 వేల విలువైన గిఫ్ట్ హ్యాంపర్లు పొందాలనుకొంటున్నారా? అయితే మీకిదో సదావకాశం. ప్రతిరోజు ఐదు ప్రత్యేక బహుమతులు, బంపర్ ప్రైజ్‌గా నిస్సాన్ మాగ్నెట్ కారు గెలుచుకొనే సువర్ణావకాశం వచ్చేసింది. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినపత్రికల ఆధ్వర్యంలో దసరా షాపింగ్ బొనాంజా అందుబాటులోకి రానున్నది. ఇందుకు సంబంధించిన షాపింగ్ బొనాంజా లోగో ఆవిష్కరణ గురువారం సాయంత్రం అమీర్‌పేటలో అట్టహాసంగా జరిగింది. ది చెన్నై షాపింగ్ మాల్, ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న బొనాంజా లోగోను తెలంగాణ పబ్లికేషన్స్ వైస్ ప్రెసిడెంట్ దేవరాజు చిరంజీవి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అశేష పాఠకుల ఆదరణతో దూసుకుపోతున్న నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినపత్రికలు ప్రతి సంవత్సరం నిర్వహించే దసరా షాపింగ్ బొనాంజా ఈ నెల 9 నుంచి 18 వరకు కొనసాగుతుందని చెప్పారు. దసరా సందర్భంగా కొనుగోలుదారులు చేసే షాపింగ్‌లకు మాల్స్ రాయితీలు ప్రకటిస్తుంటాయని, ఈ రాయితీలతోపాటు నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో జరిగే దసరా షాపింగ్ బొనాంజాలో మరొక రాయితీ ఉంటుందని తెలిపారు. 9 నుంచి 18 మధ్య ఎంపిక చేసిన ఔట్లెట్లలో జరిపే కొనుగోళ్లపై కూపన్లు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ బొనాంజాలో ప్రతిరోజు ఐదు ప్రత్యేక బహుమతులు స్మార్ట్‌టీవీ, మొబైల్, కిచెన్వేర్, రూ.5 వేల విలువైన గిఫ్ట్ హ్యాంపర్లు ఉంటాయన్నారు. బొనాంజా ముగిసిన తర్వా త జరిగే ఈవెంట్లో బంపర్ ప్రైజ్‌కు ఎంపికైనవారికి నిస్సాన్ మాగ్నెట్ కారు అందజేస్తామని చెప్పారు. దసరా షాపింగ్ చేసే వారు ఈ అవకా శాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దసరా షాపింగ్ బొనాంజాకు టైటిల్ స్పాన్పర్లుగా ది చెన్నై షాపింగ్ మాల్, ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్, మెయిన్ స్పాన్పర్లుగా సీఎమ్మార్ ఫ్యామిలీ మాల్ (తెలంగాణ), కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, గిఫ్ట్ స్పాన్సర్‌గా బిగ్‌సీ, పవర్డ్ బై కేఫ్ నీలోఫర్‌తోపాటు బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), నిస్సాన్, కున్ హ్యుండాయ్, ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్, మహవీర్ స్కోడా, మహవీర్ బెంజ్, వెంకటరమణ మోటర్స్ తోడ్పాటు అందిస్తున్నాయి. బొనాంజాకు డిజిటల్ పార్ట్నర్గా హైబిజ్ టీవీ, టీవీ పార్ట్నర్గా టీ న్యూస్, క్రియేటివ్ పార్ట్నర్గా హోప్ అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవహరిస్తున్నాయి. ఈ బొనాంజాకు సంబంధించి హైదరాబాద్‌లో ఎంపిక చేసిన ఔట్లెట్ల వివరాలతో కూడిన సమాచారం నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికల్లో ప్రతిరోజూ ప్రచురిస్తామని దేవరాజు చిరంజీవి వివరించారు. కార్యక్రమంలో ది చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యం ప్రతినిధులు, అమీర్‌పేట బ్రాంచ్ హెడ్ కే సుదీప్, వా అడ్వర్టైజింగ్ అధినేత వెంకట్రావు, నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే జీఎం (యాడ్స్) ఎన్ సురేందర్‌రావు, ఏజీఎంలు రాములు, రాజిరెడ్డి, కొనుగోలుదారులు పాల్గొన్నారు.