స్కూళ్లకు 12.. ఇంటర్ కాలేజీలకు 4 రోజులు
హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని బుధవారం నుంచి రాష్ట్రంలోని పాఠశాలలకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. ఈ రెండు పండుగల సందర్భంగా ఈ నెల 6 నుంచి 17వ తేదీ వరకు 12 రోజులపాటు సెలవులు ఇవ్వనున్నారు. తిరిగి ఈ నెల 18న పాఠశాలలు తెరుచుకోనున్నాయి.
13 నుంచి ఇంటర్ కాలేజీలకు..
ఇంటర్ కాలేజీలకు ఈ నెల 13వ తేదీ నుంచి సెలవులివ్వనున్నారు. 13 నుంచి 16 వరకు నాలుగు రోజులు మాత్రమే సెలవులు ఉంటాయి. తిరిగి 17న కాలేజీలు ప్రారంభమవుతాయి. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు.