Congress Govt | ప్రజాపాలనలో ఆడబిడ్డ బందీ.. పోలీసుల అదుపులో డీఎస్సీ అభ్యర్థి
రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు నిరుద్యోగులపై అప్రకటిత నిషేధాన్ని అమలు చేస్తున్నదనే దానికి ఈ ఘటనే నిదర్శనం. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నా, తెల్లారితే డీఎస్సీ పరీక్ష రాయాల్సి ఉన్నదని మొత్తుకున్నా వినని పోలీసులు.. సీఎం ఇంటి ముట్టడికి ఎక్కడ వస్తుందోననే అత్యుత్సాహంతో ఓ నిరుద్యోగ యువతిని ఠాణాలో నిర్బంధించారు.
- నిరుద్యోగులపై అప్రకటిత నిషేధం
- జ్వరం బాధిస్తున్నా వదలని పోలీసులు
- ఆరు గంటలపాటు ఠాణాలో నిర్బంధం
- సీఎం ఇంటి ముట్టడికి నిరుద్యోగుల పిలుపుతో పోలీసుల అత్యుత్సాహం
హైదరాబాద్, జూలై24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు నిరుద్యోగులపై అప్రకటిత నిషేధాన్ని అమలు చేస్తున్నదనే దానికి ఈ ఘటనే నిదర్శనం. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నా, తెల్లారితే డీఎస్సీ పరీక్ష రాయాల్సి ఉన్నదని మొత్తుకున్నా వినని పోలీసులు.. సీఎం ఇంటి ముట్టడికి ఎక్కడ వస్తుందోననే అత్యుత్సాహంతో ఓ నిరుద్యోగ యువతిని ఠాణాలో నిర్బంధించారు. మెడికల్ సర్టిఫికెట్లు చూపి, ఎక్కడికీ వెళ్లబోనని రాతపూర్వకంగా రాసిస్తే తప్ప విడుదల చేయలేదు. గురుకుల పోస్టుల భర్తీలో రీలింక్విష్మెంట్ విధానాన్ని అమలు చేయాలని, బ్యాక్లాగ్ లేకుండా అన్నింటినీ భర్తీ చేసి తమ కు న్యాయం చేయాలని కోరుతూ నాలుగు నెలలుగా అభ్యర్థులు పోరాటాలు చేసినా ప్ర భుత్వం ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారం చూపలేదు. ఈ నేపథ్యంలో తమ సమస్యను మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని గురుకుల అభ్యర్థులు నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈ విషయమై అభ్యర్థులు తమ వాట్సా ప్ గ్రూపుల్లో చర్చించుకుంటూ, అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మరోసారి సీఎం ఇంటి ఎదుట నిరసన చేపట్టాలని పిలుపునిచ్చారు. విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. ఆ గ్రూపుల్లో చురుకుగా పాల్గొంటున్న అభ్యర్థులను పోలీసులు టార్గెట్ చేసుకున్నారు. నిర్బంధం ప్రయోగిస్తూ బుధవారం పలువురు అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు.
యువతిని అరెస్టు చేసిన మగ పోలీసులు
నిర్బంధంలో భాగంగా హైదరాబాద్ మాణికేశ్వర్‌నగర్‌లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న మహబూబ్‌నగర్‌కు చెందిన గురుకుల అభ్యర్థి ఆస్మాను ఉస్మానియా పోలీసులు బుధవారం ఉదయమే అదుపులోకి తీసుకున్నారు. యువతిని అదుపులోకి తీసుకునే ముందు మహిళా పోలీసులు ఉండాలనే నిబంధనలను సైతం తుంగలోతొక్కి, దాదాపు ఏడుగురు మగ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని గురుకుల అభ్యర్థులు నిప్పులు చెరిగారు. అదీగాక ఆస్మా రెండు రోజులుగా వైరల్ ఫీవర్‌తోపాటు, లోబీపీతో బాధపడుతూ చికిత్స పొందుతున్నది. అంతేగాక గురువారం డీఎస్సీ పరీక్ష రాయాల్సి ఉన్నది. ఇవేవీ ఓయూ పోలీసులు వినకుండా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలీస్‌స్టేషన్‌లోనే నిర్బంధించారు. విషయం తెలుసుకున్న ఇతర గురుకుల అభ్యర్థులు అక్కడికి చేరుకుని ఎక్కడికీ వెళ్లబోమని రాతపూర్వకంగా రాసిచ్చిన అనంతరం, ఉన్నతాధికారుల అనుమతితో తమను వదిలిపెట్టారని అభ్యర్థి అస్మా సోషల్‌మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా పలువురి అరెస్టు
రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు బుధవారం పలువురు గురుకుల అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో గురుకుల అభ్యర్థి మల్సూర్ యాదవ్, విశ్వరూప్, నల్లగొండలో పరికె రాము, శ్రీనివాస్ తదితరులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ వెళ్తే కేసులు పెడతామని, భవిష్యత్తు నాశనం చేసుకోవద్దంటూ పోలీసులు బెదిరింపులకు దిగారని బాధిత గురుకుల అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

