TSPSC | టీఎస్పీఎస్సీ మరో నోటిఫికేషన్ను విడుదల చేసింది. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఖాళీగా ఉన్న 18 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 16 నుంచి జనవరి 5వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. తదితర వివరాల కోసం www.tspsc.gov.in వెబ్సైట్ను లాగిన్ అవొచ్చు.
గ్రూప్-4 నోటిఫికేషన్(9,168 ఉద్యోగాలు), మెడికల్ ఎడ్యుకేషన్లో 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడగా, నిన్న పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 లెక్చరర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. మరో వైపు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా గురువారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా 11 కేంద్రాల్లో ఈవెంట్స్ ప్రారంభమయ్యాయి.