RTC jobs | డ్రైవర్ కమ్ కండక్టర్ పోస్టుల భర్తీ.. నోటిఫికేషన్ విడుదలకు టీఎస్ఆర్టీసీ కసరత్తు..!
RTC jobs | టీఎస్ఆర్టీసీని డ్రైవర్లు, కండక్టర్ల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. మహిళలకు ఉచిత ప్రయాణంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా బస్సులను నడిపేందుకు సరిపోయేంత సిబ్బంది లేక, ప్రతి నిత్యం ప్రజల నుంచి ఆర్టీసీ విమర్శలను ఎదుర్కొవాల్సి వస్తున్నది.
హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): టీఎస్ఆర్టీసీని డ్రైవర్లు, కండక్టర్ల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. మహిళలకు ఉచిత ప్రయాణంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా బస్సులను నడిపేందుకు సరిపోయేంత సిబ్బంది లేక, ప్రతి నిత్యం ప్రజల నుంచి ఆర్టీసీ విమర్శలను ఎదుర్కొవాల్సి వస్తున్నది. ఆర్టీసీలో ప్రస్తుతం 2 వేల డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరికొన్ని కండక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
దీంతో నిత్యం బస్సుల రాకపోకల కోసం సిబ్బందిని సమకూర్చే విషయంలో అధికారులు సతమతం అవుతున్నారు. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు సిబ్బంది నియామకాలు చేపట్టాలని సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు డ్రైవర్ కమ్ కండక్టర్ పోస్టుల భర్తీకి ముందుకొచ్చింది. జిల్లాలు, ఇతర రాష్ర్టాలకు వెళ్లే సర్వీసుల్లోనూ డ్రైవర్, కండక్టర్ డ్యూటీ ఒకరే చేసేలా నియామకాలు చేపట్టనున్నట్టు తెలిసింది. డ్రైవర్ ఉద్యోగంలోకి వచ్చే వ్యక్తి కండక్టర్ డ్యూటీ కూడా చేయాల్సి ఉంటుందని ఆర్టీసీ నిబంధనలను రూపొందిస్తున్నది.
దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నట్టు సమాచారం. ఖర్చు కూడా తగ్గుతుందనే భావనతో ఈ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిసింది. హైదరాబాద్ నగరంతోపాటు శివారుల్లోని కళాశాలలు, విద్యాసంస్థల సమయపాలన ఒకేలా ఉండేలా మార్చాలని కోరుతూ ఆర్టీసీ లేఖలు రాసింది. వాటికి అనుగుణంగా 1,500 బస్సులను కళాశాలలు, విద్యాసంస్థల సమయాల్లో నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమవుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Conductors
- drivers
- TS RTC
RELATED ARTICLES
తాజా వార్తలు
టెన్త్‌లో టాపర్లకు ఢిల్లీ విమాన ప్రయాణ బహుమతి
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

