విద్యుత్తు ఉత్పత్తిలో ‘డబుల్’ ధమాకా
ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కష్టాలు మనకు తెలియని కావు. వ్యవసాయానికి 3-4 గంటలు విద్యుత్తు ఉంటే ఎక్కువ. ఇండ్లకు ఆరేడు గంటలపాటు కోత. పరిశ్రమలకు పవర్‌హాలిడే.
- రాష్ట్ర ఏర్పాటు నాటికి సామర్థ్యం 7,778 మెగావాట్లు మాత్రమే
- గత ఎనిమిదేండ్ల కాలంలో 17,305 మెగావాట్లకు చేరిక
- విద్యుత్తు ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామి
- సోలార్ విద్యుత్తు రంగంలోనూమన రాష్ట్రం అద్భుత ప్రగతి
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కష్టాలు మనకు తెలియని కావు. వ్యవసాయానికి 3-4 గంటలు విద్యుత్తు ఉంటే ఎక్కువ. ఇండ్లకు ఆరేడు గంటలపాటు కోత. పరిశ్రమలకు పవర్‌హాలిడే. విద్యుత్తు కోసం రోడ్లెక్కి ధర్నాలు చేసిన రోజులు ఇప్పటికీ కండ్లముందు కదలాడుతూనే ఉంటాయి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ అహర్నిశలు శ్రమించి పటిష్ఠ చర్యలు చేపట్టడంతో రాష్ట్రమంతటా నిరంతరం నాణ్యమైన విద్యుత్తు సరఫరా జరుగుతున్నది.
రాష్ట్ర ఆవిర్భావం నాటికి మన విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం కేవలం 7,778 మెగావాట్లు. 8 ఏండ్లలో ఇప్పుడది 17,305 మెగావాట్లకు చేరుకున్నది. సోలార్ విద్యుత్తు ఉత్పత్తి కూడా 74 మెగావాట్ల నుంచి రికార్డుస్థాయిలో 4,478 మెగావాట్లకు పెరిగింది. అంతేకాదు, తలసరి విద్యుత్తు వినియోగంలో దేశంలోని పెద్ద రాష్ర్టాల జాబితాలో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలవడం మనకు గర్వకారణం. ఈ మేరకు విద్యుత్తు శాఖ ఆదివారం వివరాలు వెల్లడించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత వల్లే ఇదంతా సాధ్యమైందనడంలో అతిశయోక్తి లేదు.
పెరిగిన తలసరి విద్యుత్తు వినియోగం
తెలంగాణ తలసరి విద్యుత్తు వినియోగం 2014లో 1,110 యూనిట్లు కాగా, ప్రస్తుతం 2,012 యూనిట్లకు పెరిగింది. జాతీయ తలసరి కరెంటు వినియోగంతో పోల్చితే ఇది 73 శాతం అధికం. తలసరి విద్యుత్తు వినియోగం ఒక సమగ్ర పురోగతిని తెలిపే సూచిక. పర్యావరణ భద్రతలో భాగంగా తీసుకొచ్చిన తెలంగాణ సోలార్ పవర్ పాలసీ దేశంలోనే అత్యుత్తమ సోలార్ పాలసీల్లో ఒకటిగా పరిగణించబడింది. ప్రస్తుతం రాష్ట్రంలో సోలార్ విద్యుత్తు సామర్థ్యం 4,950 మెగావాట్లు కాగా, వచ్చే ఏడాది నాటికి 8 వేల మెగావాట్లు దాటుతుందని అంచనా. విద్యుత్తు రంగంలో ఇదొక అద్భుత విజయంగా చెప్పవచ్చు.
అన్ని రంగాలకు నిరంతర విద్యుత్తు
అనేక కష్టాలకు ఎదురొడ్డి నేడు రాష్ట్రంలో అన్ని రంగాలకు నిరంతరాయంగా, వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్తు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. నిండు వేసవిలో కూడా 24 గంటలు నాణ్యమైన విద్యుత్తును అందిస్తుండడం మనకే సాధ్యమవుతున్నది. దేశ రాజధానిలో కోతలు, పరిశ్రమలకు పవర్ హాలిడేలు విధిస్తుండగా, మన రాష్ట్రంలో కరెంటు కోతలు విధించిన దాఖలాలు లేవు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

