నెలాఖరులో గ్రేటర్లో రెండు పడక గదుల ఇళ్లు ప్రారంభం

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఈ నెలాఖరులో ప్రారంభం కానున్నాయి. ఈ నెల 26, 28 అదేవిధంగా జులై 1, 4 తేదీల్లో లబ్దిదారులకు ఇళ్లు కేటాయించనున్నారు. రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ లబ్దిదారులకు ఇళ్ల పత్రాలు అందజేయనున్నారు. పీవీ మార్గ్‌లోని అంబేద్కర్ నగర్లో నిర్మించిన 330 ఇళ్లను అదేవిధంగా జీవైఆర్ కాంపౌండ్‌లో 180, పొట్టి శ్రీరాములునగర్లో 162, గొల్ల కుర్మయ్య కాలనీలో 10 ఇళ్లను మంత్రి కేటీఆర్ లబ్దిదారులకు పంపిణీ చేయనున్నారు. నిర్మాణం పూర్తైన మరొకొన్ని చోట్ల దశలవారీగా లబ్దిదారులకు ఇళ్లు అందజేయనున్నారు.
నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న సీఎం కేసీఆర్ సంకల్పంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 111 ప్రాంతాల్లో చేపట్టిన లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లను విడతల వారీగా లబ్ధిదారులకు జీహెచ్ఎంసీ అందజేస్తున్నది. ఇప్పటికే 12 చోట్ల 2478 ఇండ్లను ప్రారంభించగా, తాజాగా మరో ఆరు చోట్ల 1273 ఇండ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
రఘునందన్ కృషి స్ఫూర్తిదాయకం.. నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటయ్
ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

