ఫీజులు పెంచొద్దు

- ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలి
- అదీ నెలవారీగానే.. ఉల్లంఘిస్తే గుర్తింపు రద్దు
- ప్రైవేటు పాఠశాలలకు విద్యాశాఖ ఉత్తర్వులు
హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ స్కూళ్లు 2021-22 విద్యా సంవత్సరానికి ఫీజులను పెంచవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి ఫీజులు పెంచడానికి వీల్లేదని స్పష్టంచేసింది. రాష్ట్ర పరిధిలోని స్కూళ్లతో పాటు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ సహా ఇతర ఇంటర్నేషనల్ బోర్డుల నుంచి గుర్తింపు పొందిన స్కూళ్లన్నీ ఆదేశాలను పాటించాలని పేర్కొన్నది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా సోమవారం జీవో 75 జారీచేశారు. గత ఏడాది జారీ చేసిన జీవో 46 ప్రకారమే స్కూళ్లు నడుచుకోవాలని జీవోలో పేర్కొన్నారు. అదీకాక ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలని, అది నెలవారీగా మాత్రమే తీసుకోవాలని స్పష్టంచేశారు. నిబంధనలను పాటించని విద్యాసంస్థల గుర్తింపును రద్దుచేస్తామని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జీవో అమలుకు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ను ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలి’
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
Harish Rao | కాంగ్రెస్ పాలన ఎల్‌నినో కంటే ప్రమాదకరం : మాజీ మంత్రి హరీష్‌రావు
trailer hits several vehicles | పలు వాహనాలను ఢీకొట్టిన 18 చక్రాల ట్రైలర్.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
Assam: ఖాజీరంగాలో ట్రక్కు, బస్సు ఢీ.. 23 మంది మృతి, ఏడు మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

