గులాబీ కండువా కప్పుకొంటే బెదిరిస్తారా?
బొగ్గు బావులమీద గులాబీ కండువాలు వేసుకున్న కార్మికులను ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ నాయకులు బెదిరిస్తే ఊరుకునేది లేదని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి హెచ్చరించారు. బుధవారం భూపాలపల్లిలోని కేటీకే -5వ గని ఆవరణలో టీబీజీకేఎస్ భూపాలపల్లి బ్రాంచి కమిటీ ఉపాధ్యక్షుడు బడితల సమ్మయ్య ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు.
- ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాలకు కాలం చెల్లింది
- టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి
కృష్ణ కాలనీ, జూన్ 10 : బొగ్గు బావులమీద గులాబీ కండువాలు వేసుకున్న కార్మికులను ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ నాయకులు బెదిరిస్తే ఊరుకునేది లేదని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి హెచ్చరించారు. బుధవారం భూపాలపల్లిలోని కేటీకే -5వ గని ఆవరణలో టీబీజీకేఎస్ భూపాలపల్లి బ్రాంచి కమిటీ ఉపాధ్యక్షుడు బడితల సమ్మయ్య ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార తన పేషీలో రోజువారీ కార్యక్రమాలు, వాహనాల ఖర్చుకు సింగరేణి సొమ్మును వాడుకోవచ్చు గానీ, సింగరేణిలోని ఆ ర్వో ప్లాంట్‌ను రిపేర్ చేయడానికి డబ్బులు లేవా? అని ప్రశ్నించారు.
కేటీకే -5ఇైంక్లెన్ గనిలో మ్యాన్ రైడింగ్ సమస్యను పరిష్కరించి కూల్చిన షెడ్డును వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. ‘ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ నాయకులారా.. ఖబడ్దార్ మీ కాలం ముగిసింది.. కార్మికులు మీపై తిరగబడి, మిమ్మల్ని తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయి’ అని హెచ్చరించారు. టీబీజీకేఎస్ కార్మికులకు ప్రశ్నించేతత్వాన్ని నేర్పించిందని స్పష్టంచేశారు. ఈనెల 12న బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించే సింగరేణి పరిరక్షణ సదస్సుకు హరీశ్‌రావు హాజరవుతారని, కార్మికులు తరలిరావాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

