కస్టమర్ కేర్ నంబర్లకు గూగుల్ చేయొద్దు!
- 1930కు డయల్ చేస్తే అసలు నంబర్ చెప్తాం
- సైబర్ క్రైం పోలీసుల సూచనలు
- గూగుల్ సెర్చ్‌తో రూ.11.82 కోట్లు పోగొట్టుకొన్న బాధితులు
- 2,662కు పైగా ఫిర్యాదులు
హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): బ్యాంకులు, ఇతర కంపెనీల కస్టమర్ కేర్ నంబర్ల కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారా? అయితే, ఒక్క నిమిషం. సైబర్ నేరగాళ్లు గూగుల్‌లో తమ నంబర్లు నమోదు చేసి, వినియోగదారుల నుంచి సర్వీస్ పేరుతో, ట్యాక్స్ పేరుతో అందినకాడికి దోచుకొంటున్నారు. గూగుల్‌లో సెర్చ్‌లో ఆయా సంస్థలు, బ్యాంకుల పేరులో కొద్దిపాటి మార్పులు చేసి తమ నంబర్లనే కస్టమర్ కేర్ నంబర్లుగా పెడుతున్నారు.
ఇందుకోసం గూగుల్ యాడ్స్ ఇచ్చి, సెర్చ్ చేయగానే కనిపించేలా ఏర్పాటు చేసుకొంటున్నారు. బాధితుల నుంచి కాల్ రాగానే.. మీ సొమ్ము రికవరీ కావాలంటే బ్యాంకు ఖాతా వివరాలు, ఫోన్ నంబర్, అడ్రస్, ఆధార్ నంబర్, సీవీవీ నంబర్ చెప్పాలని అన్ని వివరాలు అడుగుతున్నారు. ఆ వివరాలతో మరో మారు డబ్బులు కొట్టేస్తున్నారు. ఇలాంటి కేసులు జనవరి నుంచి మే 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,662కు పైగా నమోదయ్యాయని సైబర్ క్రైం పోలీసులు తెలిపారు. బాధితుల నుంచి రూ.11.82 కోట్లు కొల్లగొట్టినట్టు పేర్కొన్నారు.
1930కు కాల్ చేయాలి
కస్టమర్ కేర్ నంబర్ల కోసం వినియోగదారులు గూగుల్ సెర్చ్ చేయవద్దని సైబర్ క్రైం పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ నేరాలకు సంబంధించి ఫిర్యాదు కోసం కేటాయించిన టోల్ ఫ్రీ నంబర్ 1930కు నేరుగా కాల్ చేయాలని తెలిపారు. ఆయా సంస్థలకు చెందిన నిజమైన నంబర్లు అందించేందుకు తెలంగాణ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్(టీ4సీ)లో ప్రత్యేకంగా సిబ్బందిని నియమించినట్టు పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే వెంటనే https://cybercrime. gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

