Digital Classes : 3,000 బడుల్లో డిజిటల్ క్లాసులు

- 2 వేల స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్‌లు
- ల్యాబ్‌లు, క్లాస్‌రూంలకు రూ.170 కోట్లు
- ఇటీవలి పీఏబీ సమావేశంలో ఆమోదం
హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): పాఠశాల విద్యను డిజిటలైజేషన్‌గా మార్చేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. రెండు వేల పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌లు, మూడు వేల పాఠశాలల్లో డిజిటల్ తరగతి గదులను ఏర్పాటుచేయనున్నారు. ఈ నిధులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60ః40 నిష్పత్తిలో భరించనున్నాయి. కంప్యూటర్ ల్యాబ్‌లకు రూ.100 కోట్లు, డిజిటల్ క్లాస్‌రూంలకు రూ.70 కోట్లు నిధులిచ్చేందుకుగాను సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) ప్రాజెక్ట్ ఆమోదిత మండలి (పీఏబీ) సమావేశం ఇటీవలే ఆమోదముద్రవేసింది. 2021-22 విద్యాసంవత్సరంలో వీటిని చేపట్టేందుకు అనుమతినిచ్చింది. తెలంగాణలో 26,800 ప్రభుత్వ పాఠశాలున్నాయి. వీటిలో 22,34,084 మంది చదువుతున్నారు.
కార్పొరేట్ స్కూళ్లను మించి వసతులు కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా సర్కారు బడులను ఆధునీకరించేందుకు పెద్దఎత్తున నిధులను ఖర్చుచేయనున్నారు. కరోనాతో ఆన్లైన్ తరగతులే ప్రత్యామ్నాయంగా మారిన నేపథ్యంలో ఆయా నిధులతో డిజిటల్ బోధనకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిదశలో అత్యధికంగా విద్యార్థులు స్కూళ్లను ఎంపికచేసి వాటిల్లోనే కంప్యూటర్ ల్యాబ్‌లు, డిజిటల్ తరగతి గదుల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. స్కూళ్లల్లో ప్రత్యేకంగా ఒక కంప్యూటర్ ల్యాబ్‌తోపాటు పాఠశాలకు రెండు చొప్పున తరగతి గదులను డిజిటల్ క్లాసురూంలుగా మార్చనున్నారు. వాస్తవానికి ఈ నిధులు గతంలోనే మంజూరయ్యాయి. కానీ, రెండేండ్లుగా కరోనా పరిస్థితుల కారణంగా వీటిని చేపట్టలేని పరిస్థితి నెలకొన్నది. ఈ విద్యాసంవత్సరం ఐదువేల పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌లు, డిజిటల్ క్లాస్‌రూంలను ఏర్పాటుకు అనుమతివ్వాలని సమగ్రశిక్షా అభియాన్ పీఏబీ సమావేశం ముందుంచారు. ఇందుకు కేంద్రం అనుమతివ్వడంతో నిధులను సద్వినియోగం చేసుకుని డిజిటల్ తరగతులు, కంప్యూటర్ ల్యాబ్‌ల ఏర్పాటుకు అధికారులు సమాయత్తమయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

