DGP Ravi Gupta | ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : డీజీపీ రవి గుప్తా
DGP Ravi Gupta | ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కు ను వినిగించుకోవాలి డీజీపీ రవి గుప్తా(DGP Ravi Gupta) తెలిపారు.
హైదరాబాద్ : తెలంగాణలో ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలకు(Parliament elections) అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కు ను వినిగించుకోవాలి డీజీపీ రవి గుప్తా(DGP Ravi Gupta) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా పూర్తి చేశామని తెలిపారు. లోక్‌సభ ఎన్నికలకు 73,414 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
500 తెలంగాణ స్పెషల్ ఫోర్స్ విభాగాలు సహా.. 164 సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్‌తో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వివరాలను వెల్లడించారు. అలాగే 7వేల మంది ఇతర రాష్ట్రాల హోంగార్డులతో బందోబస్తు నిర్వహి స్తున్నా మని, 89 ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్‌పోస్టులు, 173 అంతర్ జిల్లా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. రూ.186కోట్ల విలువ చేసే మద్యం, డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని, తనిఖీలకు సంబంధించి 8,863 కేసులు నమోదు చేశామన్నారు.
మావోయిస్టు(Maoists) ప్రభావిత ప్రాంతంలో కేంద్ర బలాలతో భద్రత ఏర్పాటు చేసాం. సోషల్ మీడియాలో(Social media) అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియా కోసం ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటు చేశాం. రాష్ట్ర సరిహద్దుల్లో పారామెలిటీ బలగాలతో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు డీజీపీ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

