డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతాం : డీజీపీ అంజనీ కుమార్
రాష్ట్రంలో డ్రగ్స్ రవాణా, వాడకంపై ఉక్కుపాదం మోపి డ్రగ్స్ వ్యవస్థను అడ్డుకుంటామని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు.
హైదరాబాద్ : రాష్ట్రంలో డ్రగ్స్ రవాణా, వాడకంపై ఉక్కుపాదం మోపి డ్రగ్స్ వ్యవస్థను అడ్డుకుంటామని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. హైదరాబాద్ లో శుక్రవారం అన్ని జిల్లాల అధికారులతో ఎన్డీపీఎస్ చట్టం, దర్యాప్తు ప్రక్రియపై నిర్వహించిన ఒకరోజు శిక్షణను డీజీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నార్కోటిక్స్ డ్రగ్స్ ,సైకోట్రోపిక్ పదార్థాలు యువతను పెడదారిన పట్టిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
సమాజంలోని కొన్ని వర్గాలల్లో మాదకద్రవ్య వ్యసనం ప్రబలంగా మారిందని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల రవాణా వ్యవస్థీకృత నేరంగా మారిందని, గొలుసుకట్టు కేసులను విచ్ఛిన్నం చేయడానికి శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తు చేయాలని సూచించారు. మూలాల గమ్యాన్ని గుర్తించి చర్యలు తీసుకున్నప్పుడే డ్రగ్స్‌ను కంట్రోల్ చేయవచ్చని తెలిపారు.
ఎన్డీపీఎస్ చట్టంలో నిర్దేశించిన విధానం ప్రకారం డ్రగ్స్ స్వాధీనం సక్రమంగా చేపట్టాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీఐడీ ఏడీజీపీ మహేశ్ ఎం భగవత్ మాట్లాడుతూ గత సంవత్సరం తెలంగాణలో 214 మంది నేరస్థులపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేశామన్నారు. రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ఎ. రాంగధన్,నార్కొటిక్ సెల్ ఎస్పీ సి.అనసూయ తదితరులు శిక్షణలో పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

