Manjeera Kumbh Mela | నేటి నుంచి మంజీర కుంభమేళా
Manjeera Kumbh Mela | మంజీర నదిలో పుష్కరుడు ప్రవేశించిన వేళ సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని పంచవటి క్షేత్రం ఆవరణలో సోమవారం నుంచి గరుడగంగ కుంభమేళా ప్రారంభంకానున్నది. పంచవటి క్ష్రేతం పీఠాధిపతి కాశీనాథ్ బాబా ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు ధ్వజారోహణంతో కుంభమేళా ప్రారంభమవుతుంది. ఉ
Manjeera Kumbh Mela | సంగారెడ్డి, ఏప్రిల్ 23(నమసే తెలంగాణ): మంజీర నదిలో పుష్కరుడు ప్రవేశించిన వేళ సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని పంచవటి క్షేత్రం ఆవరణలో సోమవారం నుంచి గరుడగంగ కుంభమేళా ప్రారంభంకానున్నది. పంచవటి క్ష్రేతం పీఠాధిపతి కాశీనాథ్ బాబా ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు ధ్వజారోహణంతో కుంభమేళా ప్రారంభమవుతుంది. ఉదయం 11 నుంచి భక్తులు మంజీర నదిలో పుణ్యస్నానాలు చేస్తారు. ఆ తర్వాత ప్రత్యేక పూజలు, బోనాలు నిర్వహిస్తారు. కుంభమేళాకు ఉత్తరాధి నుంచి నాగసాధువులు, సాధుసంతులు, పీఠాధిపతులు తరలిరానున్నారు.
తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. ఈ కుంభమేళా రెండు వారాలపాటు కొనసాగనుంది. రోజూ సాయంత్రం మంజీర నదికి గంగా హారతి ఇస్తారు. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టర్ శరత్ పర్యవేక్షణలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. కుంభమేళాకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ అధికారులు జహీరాబాద్, నారాయణఖేడ్ డిపోల నుంచి ప్రత్యేకంగా బస్సులను నడుపుతున్నారు. కుంభమేళా ప్రారంభోత్సవంలో జహీరాబాద్, నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు మాణిక్‌రావు, భూపాల్‌రెడ్డి, కలెక్టర్ శరత్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ తదితరులు పాల్గొంటారు. ఈ నెల 28న మంత్రి హరీశ్‌రావు కుంభమేళాకు హాజరుకానున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

