Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
పవిత్ర పుణ్యక్షేత్రమైన మెదక్ జిల్లాలోని ఏడుపాయల వన దుర్గ భవాని మాత సన్నిధిలో ఆదివారం దసరా సందర్భంగా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.
పాపన్నపేట : పవిత్ర పుణ్యక్షేత్రమైన మెదక్ జిల్లాలోని ఏడుపాయల వన దుర్గ భవాని మాత సన్నిధిలో ఆదివారం దసరా సందర్భంగా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మెదక్ జిల్లా అదనప కలెక్టర్ నగేష్ అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారు బాలాత్రిపుర సుందరి దేవి(శైలపుత్రి) రూపంలో దర్శనమిచ్చారు.
వేద పండితులు మూలవిరాట్ దుర్గామాత తో పాటు, శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్న గోకుల్ షెడ్ లో ఉన్న ఉత్సవ విగ్రహాన్ని సైతం బాల త్రిపుర సుందరి దేవి రూపంలో ప్రత్యేకంగా అలంకరించారు. ముందుగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయం నుండి పల్లకిలో ఊరేగింపుగా తీసుకెళ్లి గోకుల్ షెడ్ లో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజులపాటు జరగనున్నాయి. ఈ సందర్భంగా నిత్యం అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ ఇఓ వీరేశం వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

