మరిన్ని కీలక పత్రాలు లభ్యం

- ఉర్దూ నుంచి ఇంగ్లిష్‌లోకి తర్జుమా
- దేవర భూములపై నేడో రేపో నివేదికలు
మేడ్చల్, మే 26 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లా దేవరయాంజాల్ దేవాలయ భూములకు సంబంధించి కీలక పత్రాలు లభించినట్టు తెలిసింది. ఏసీబీ, విజిలెన్స్ అధికారులు తార్నాకలోని రాజ్యాభిలేఖనం కార్యాలయంలో మంగళవారం పురాతన పహాణీల పరిశీలనలో పలు పత్రాలు లభించినట్టు సమాచారం. ఉర్దూ భాషలో ఉన్న ఈ పత్రాలను ఏసీబీ, విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకొని ఇంగ్లిష్‌లోకి తర్జుమా చేసేందుకు ఉర్దూ బాషా సీనియర్ ఉపాధ్యాయుల సహకారం తీసుకుంటున్నారు. నివేదికను గురువారం నాటికి సిద్ధం చేయనున్నారు. ఆక్రమణదారులకు, అక్రమ నిర్మాణాలకు వివిధ విభాగాలు ఇచ్చిన అనుమతుల ఆధారంగా నాటి అధికారులను, ఉద్యోగులను సుమారు 60 మందిని విచారించారు. విచారణ నివేదికను పూర్తి ఆధారాలతో సహా బుధవారం సిద్ధంచేసినట్టు సమాచారం. నేడో రేపో వీటిని ప్రభుత్వానికి సమర్పిస్తారు.
రాజ్యాభిలేఖనం కార్యాలయంలో లభించిన పురాతన పత్రాలు దేవర భూముల వ్యవహారంలో కీలకం కానున్నాయి. 1924- 25లో నిజాంవద్ద విధులు నిర్వహించిన రామిడి పుల్లయ్య దేవరయాంజాల్‌లోని వందల ఏండ్ల చరిత్ర కలిగిన సీతారామస్వామి దేవాలయానికి సర్వే నంబర్ 91లోని 1,525 ఎకరాల భూమిని నవాబుతో రాయించి ఇచ్చారు. ఆ పత్రాలు రాజ్యాభిలేఖనం కార్యాలయంలో లభ్యమైనట్టు తెలుస్తున్నది. వాటిని ఇంగ్లిష్‌లోకి అనువదిస్తే పూర్తి ఆధారాలు లభించినట్టే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు 32 ఏళ్ల గొర్రెల కాపరి మృతి!
వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్!
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ యువకుడి పాదయాత్ర.. మార్గమధ్యలో కలిసి అభినందించిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి!
Bigg Boss 10 | ఈ వారం ఎలిమినేషన్ డేంజర్లో ఆ నలుగురు.. టాప్‌లో వంశీ, రోహిత్!
Mouni Roy | గ్లామర్ డోస్ పెంచిన మౌనీ రాయ్.. రెడ్ డ్రెస్‌లో అందాల విందు!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

