దేవరయాంజాల్ భూములు పునఃపరిశీలన

సర్వేనంబర్ల ఆధారంగా భూముల వద్దే రికార్డుల తనిఖీ
మేడ్చల్, మే 10 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దేవరయాంజాల్ ఆలయ భూములను ఐఏఎస్‌ల ప్రత్యేక విచారణ కమిటీ సోమవారం పునఃపరిశీలించింది. దేవాదాయ, రెవెన్యూ రికార్డుల్లోని సర్వేనంబర్ల ఆధారంగా కమిటీ భూముల వద్దే స్వయంగా తనిఖీచేసింది. కబ్జాచేసి ఫెన్సింగ్ వేసిన భూముల వివరాలను రికార్డుల ఆధారంగా పరిశీలించారు. దేవాదాయ భూములతోపాటు కబ్జాకు గురైన సీలింగ్ భూముల వివరాలను కూడా సేకరించారు. శ్రీసీతారామస్వామి ఆలయ భూముల వ్యవహారంలో మాజీమంత్రి ఈటల రాజేందర్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఐఏఎస్‌ల ప్రత్యేక కమిటీ విచారణ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధికార యంత్రాంగం 8 బృందాలుగా ఏర్పడి నిర్వహించిన సర్వే ఆధారంగా దేవాదాయ భూముల కబ్జాదారుల వివరాలను సేకరించినట్టు సమాచారం. దీంతో తిరిగి ఆ భూములను పున పరిశీలించిన కమిటీ అవి కబ్జాలకు గురైనట్టు నిర్ధారించుకున్నట్టు తెలిసింది. దేవుడిమాన్యంలో నిర్మాణాలు జరిపిన వారి పూర్తి వివరాలను మూడురోజుల కిత్రం పంచాయతీరాజ్, రిజిస్ట్రేషన్, విద్యుత్తు విభాగాల అధికారుల విచారణలో ప్రత్యేక కమిటీ రాబట్టినట్టు సమాచారం. ఇప్పటికే 160 అక్రమ నిర్మాణాలను గుర్తించిన కమిటీ వీటిపై మున్సిపల్శాఖనూ విచారించే అవకాశం ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

