బ్రహ్మాండంగా డబుల్ ఇండ్లు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పేదల కోసం నిర్మించిన ఆత్మగౌరవ సౌధాలు బ్రహ్మాండంగా ఉన్నాయని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ పేర్కొన్నారు.
- లాటరీ పద్ధతిలో కేటాయింపు
- శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ వెల్లడి
- ప్రతాపసింగారంలో డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపు
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పేదల కోసం నిర్మించిన ఆత్మగౌరవ సౌధాలు బ్రహ్మాండంగా ఉన్నాయని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ పేర్కొన్నారు. శనివారం ఆయన మేడ్చల్ జిల్లా ప్రతాపసింగారంలో 28 ఎకరాల్లో నిర్మించిన 2 వేలకుపైగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌తో కలిసి ప్రారంభించారు. ఎన్ఐసీ వెబ్సైట్ సహకారంతో లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేశా రు. అంబర్‌పేట నియోజకవర్గానికి 500, ఎల్బీనగర్ నియోజకవర్గానికి 500 చొప్పున ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించారు. ఈ సందర్భంగా పద్మారావుగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ సర్కారు నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చిందని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు చాలా అద్భుతంగా ఇండ్లను నిర్మించారని అభినందించారు. డబుల్ బెడ్రూం ఇండ్లను ఇప్పిస్తామని చెప్పే దళారుల మాటలను ఎవరూ నమ్మవద్దని సూచించారు. ఇతర పార్టీల నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. కేవలం అధికారులు, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులను మాత్రమే సంప్రదించాలని సూచించారు. లాటరీ పద్ధతిలో పారదర్శకంగా ఇండ్లను కేటాయించినట్టు చెప్పారు.
ఉచితంగా రూ.40 లక్షల విలువచేసే ఇండ్లు
నిరుపేదలకు రూ.40 లక్షల విలువ చేసే ఇండ్లను నయాపైసా తీసుకోకుండా పూర్తి ఉచితంగా అందజేశామని పద్మారావుగౌడ్ తెలిపారు. అంబర్‌పేట నియోజకవర్గ పరిధిలో తన చేతుల మీదుగానే 500 డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉన్నదని, తన జీవితంలో ఇంతకంటే ఆనందం ఉండబోదని చెప్పారు. లబ్ధిదారులందరూ సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉన్నదని తెలిపారు. కేసీఆర్ సర్కారు మళ్లీ అధికారంలోకి వస్తే.. ఇలాంటి ఎన్నో అద్భుతమైన పథకాలు ప్రజల ముంగిట నిలుస్తాయని చెప్పారు.
జీవితకాలం మా ఓటు కేసీఆర్ సార్కే
ఇల్లు వస్తది అనుకోలే. పట్టా అందుకున్నా ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. సీఎం కేసీఆర్ సార్‌ను మరిచిపోలేం. మా బంధువులు ఉండే ప్రాంతంలోనే మాకు సిటీలో ఇల్లు వస్తదని కలలో కూడా ఉహించలేదు. నిజంగా సీఎం కేసీఆర్ సార్ దేవుడే. పన్నెండేండ్లుగా ఒకే గదిలో అద్దెకు ఉంటున్నం. మాకు నగరంలో ఇల్లు ఉన్నదని చెప్పుకోవడానికి గర్వ పడుతున్నం. జీవితాంతం మా ఓటు కేసీఆర్ సార్కే వేస్తం.
– ఫాతిమా మేరి, మల్లాపూర్
సీఎం కేసీఆర్ సారు దేవుడు
ఇల్లు కోసం ఎంతో మంది ఎన్నో మాటలు చెప్పిన్రు. కానీ నేను అవేమీ పట్టించుకోలే. సొంతంగా దరఖాస్తు చేసుకున్న. అదృష్టం ఉంటే వస్తదని అనుకున్న. కానీ, నేను అనుకున్నట్టే నాకు ఇల్లు వచ్చింది. అధికారులు ఫోన్ చేసిన చెప్పిన వెంటనే ఎక్కడ లేని సంతోషం వచ్చింది. కేసీఆర్ సారు దేవుడు. మా అసువంటోళ్లను ఆ దేవుడు కరుణించకున్నా.. ఈ దేవుడు కరుణించిండు. ఈ జన్మకు ఇది చాలు.
– మక్కల సుజాత, సనత్‌నగర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

