టీచర్లు వేధిస్తున్నారని డీఈవో ఫిర్యాదు
కొంత మంది ఉపాధ్యాయులు, మాజీ టీచర్లు తనను మానసికంగా వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు నిజామాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్ తెలిపారు.
- ఒత్తిడి తట్టుకోలేక నిజామాబాద్ రూరల్ పోలీసులకు కైంప్లెంట్
ఖలీల్‌వాడి, జూలై 18: కొంత మంది ఉపాధ్యాయులు, మాజీ టీచర్లు తనను మానసికంగా వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు నిజామాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. ఉద్యోగుల బదిలీల విషయంలో తనపై తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని వాపోయారు. ఇటీవల జరిగిన పదోన్నతుల్లో సిరికొండ మండలంలో పలు అక్రమాలు జరిగాయని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపించాయని, పలువురు టీచర్లు సైతం తమకు అన్యాయం జరిగిందంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారని తెలిపారు.
ఈ నేపథ్యంలోనే కొందరు టీచర్లు తనను వేధిస్తున్నారని ఇటీవల రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. విశ్రాంత ఉపాధ్యాయుడు శంతన్, స్కూల్ అసిస్టెంట్ బాలయ్య, ఇతరులు తనపై వ్యక్తిగతంగా ప్రకటనలు చేస్తూ మానసిక క్షోభకు గురిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్టు వివరించారు. ప్రతి విషయానికి కార్యాలయానికి వచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పారు. వారి వల్ల తనతోపాటు తన కుటుంబం కూడా ఇబ్బంది పడుతున్నదని, ఈ ఒత్తిడిని తట్టుకోలేకే పోలీసులకు ఫిర్యాదు చేశానని డీఈవో స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

