కరీంనగర్ : అనుమానాస్పదస్థితిలో ఓ విద్యార్థిని ఉరేసుకొని బలవన్మరణానికి(committed suicide) పాల్పడటం స్థానికంగా కలకం సృష్టించింది. ఈ విషాదకర సంఘటన కరీంనగర్ రూరల్ మండలంనగునూర్లోని తెలంగాణ సాంఘిక గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న(Degree student) సృజన అనే విద్యార్థిని బుధవారం రాత్రి హాస్టల్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం హాస్టల్ సిబ్బంది చూసి పోలీసులు, ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. కాగా, మానకొండూర్ మండలం గంగిపల్లికి చెందిన సృజన స్వగ్రామంలో విషాదం అలుముకుంది. సృజన ఆత్మహత్యకుగల కారణాలు తెలియాల్సి ఉంది.