Defence System | జహీరాబాద్‌లో వెయ్యికోట్లతో డిఫెన్స్ సిస్టమ్స్
Defence System | ఏరోస్పేస్, రక్షణ రంగ పెట్టుబడులకు హైదరాబాద్ కేం ద్రంగా మారిందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో
- రెండు వేల మందిపైగా ఉద్యోగాలు
- ‘రక్షణ’ పెట్టుబడుల కేంద్రంగా హైదరాబాద్: మంత్రి కేటీఆర్
- తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉన్నది
- డీఆర్డీవో చైర్మన్ సతీశ్‌రెడ్డి ప్రశంస
- రాష్ట్ర ప్రభుత్వంతో వెమ్ టెక్నాలజీస్ పరస్పర అవగాహన ఒప్పందం

హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): ఏరోస్పేస్, రక్షణ రంగ పెట్టుబడులకు హైదరాబాద్ కేం ద్రంగా మారిందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన వెమ్ టెక్నాలజీస్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో రూ.1,000 కోట్ల పెట్టుబడితో ‘లార్జ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్స్’ను స్థాపించనున్నది. ఇందుకోసం ఆదివారం హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకొన్నది.ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్, డీఆర్డీవో చైర్మన్ సతీశ్‌రెడ్డి, నీతిఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్, వెమ్ టెక్నాలజీస్ సీఎండీ వీ వెంకటరాజు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మా ట్లాడుతూ.. ఏరోస్పేస్, రక్షణ రంగాలకు సంబంధించి రాష్ట్రంలో వెయ్యికి పైగా ఎంఎస్ఎంఈలు, డీఆర్డీవో, బీడీఎల్ వంటి ప్రభుత్వరంగ సంస్థలు, ఇతర సూక్ష్మ సంస్థలు పనిచేస్తున్నాయని తెలిపారు.
వీటితోపాటు లాక్‌హీడ్, బోయింగ్, జీఈ, సాఫ్రన్ వంటి అంతర్జాతీయ సంస్థలకు సైతం హైదరాబాద్ కేంద్రంగా ఉన్నదని చెప్పారు. రాష్ట్రంలో నాణ్యమైన మానవ వనరులు ఉండటంతో ఏరోస్పేస్, రక్షణరంగ పెట్టుబడులకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారిందన్నారు. వెమ్ టెక్నాలజీస్ పెట్టుబడితో రెండువేలకు పైగా ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు. జహీరాబాద్‌లో వెమ్ టెక్నాలజీస్ నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించటంపై సంతోషం వ్యక్తంచేశారు. ఈ కేంద్రంతో స్థానిక యువతకు నైపుణ్యాలు పెరిగి, ఉద్యోగావకాశాలు మెరుగవుతాయని చెప్పారు. వెమ్ టెక్నాలజీస్ విజ్ఞప్తి మేరకు ప్రాజెక్టుకు మెగా ప్రాజెక్ట్ హోదా ఇస్తామని, వారు కోరినవిధంగా 511 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని వెల్లడించారు. నాలుగేండ్ల కిందట డీఆర్డీవో చైర్మన్ సతీశ్‌రెడ్డి తనతో మాట్లాడుతూ 2017-22 మధ్య హైదరాబాద్‌కు రూ.లక్ష కోట్ల రక్షణరంగ ఆర్డర్లు వస్తాయని చెప్పారని, అది ఇప్పుడు వాస్తవరూపం దాల్చుతున్నదని ఆయన గుర్తుచేశారు.
పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం: సతీశ్‌రెడ్డి
తెలంగాణలో పెట్టుబడుల అనుకూల వాతావరణం ఉన్నదని డీఆర్డీవో చైర్మన్ సతీశ్‌రెడ్డి ప్రశంసించారు. అధికారులు ప్రతిక్షణం అందుబాటులో ఉండి, రాష్ట్ర అనుకూలతలను వివరిస్తారని చెప్పారు. నగరంలోని కంపెనీలతో డీఆర్డీవో అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. నీతిఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పలు రక్షణరంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు చూస్తున్నదని, వెమ్ టెక్నాలజీస్ వంటి హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే భారతీయ కంపెనీలు ఈ అవకాశాలను అందిపుచ్చుకొనే స్థాయిలో ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో ఐటీశాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ వెంకట నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాచారంలో తక్షణమే మైనింగ్ తవ్వకాలు ఆపాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
PM Modi | ఢిల్లీలో మోదీతో పోలండ్ ప్రధాని భేటీ.. ఇండియా-పోలండ్ మధ్య కీలక ఒప్పందాలు
FMG Doctors | ఎఫ్ఎంజీ వైద్యుల నిరసన.. అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో
Man Dragged On Car Roof | వ్యక్తి చేతులను కారు విండోలో ఇరికించి రూఫ్‌పై తీసుకెళ్లి.. వాహనంతో తొక్కి హత్య
Akka Trailer | స్త్రీల రాజ్యమేలుతున్న పెన్నురు గడ్డపై పవర్ వార్.. కీర్తి సురేష్ ‘అక్క’ ట్రైలర్ అదుర్స్!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

