బీజేపీని ఓడించడమే లక్ష్యం
మునుగోడులో మతతత్వ బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పని చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని పీబీ గార్డెన్లో శనివారం నిర్వహించిన పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ ప్రజలకు కాషాయ రాజకీయ పాలన ముప్పుగా మారిందన్నారు. ఆ పార్టీ రాష్ర్టాల్లో అమ్మకాలు, కొనుగోళ్లు అనే దుర్మార్గమైన సిద్ధాంతాలను పాటిస్తున్నదని మండిపడ్డారు
- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
చౌటుప్పల్ రూరల్, ఆగస్టు 13 : మునుగోడులో మతతత్వ బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పని చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని పీబీ గార్డెన్లో శనివారం నిర్వహించిన పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ ప్రజలకు కాషాయ రాజకీయ పాలన ముప్పుగా మారిందన్నారు. ఆ పార్టీ రాష్ర్టాల్లో అమ్మకాలు, కొనుగోళ్లు అనే దుర్మార్గమైన సిద్ధాంతాలను పాటిస్తున్నదని మండిపడ్డారు. ఇతర పార్టీల నేతలను డబ్బు పెట్టి కొనేందుకు దుకాణం మొదలెట్టిందని విమర్శించారు.
అలాంటి పార్టీకి చెందిన నాయకులు కొంతమంది అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఉప ఎన్నికలో సీపీఐ, సీపీఎం కలిసి ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు సీపీఐతో సంప్రదింపులు జరుగుతున్నాయని చెప్పారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా అవకాశవాదమని విమర్శించారు. రాజగోపాల్రెడ్డి సీపీఎం కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు చేశారని, అందుకే ఆయన్ని ఓడించేందుకు సీపీఎం కృషి చేస్తుందని స్పష్టంచేశారు. సమావేశంలో పార్టీ నాయకులు చెరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

