హైదరాబాద్: నమస్తే తెలంగాణ తెలుగు దినపత్రిక సీఎండీ దామోదర్ రావు తండ్రి శ్రీ దేవరకొండ నారాయణ రావు ఇవాళ కన్నుమూశారు. నారాయణ రావు పార్దీవదేహానికి మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బంజారా హిల్స్‌లో ఉన్న నివాసం నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు అంతిమయాత్ర చేపట్టనున్నారు. జూబ్లీహిల్స్‌లో ఉన్న మహాప్రస్థానంలో మధ్యాహ్నం 2 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.