DEE CET Results | డీఈఈ సెట్లో 78.18 శాతం మంది ఉత్తీర్ణత.. స్టేట్ టాపర్లు వీరే..
DEE CET Results | డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన డీఈఈసెట్-2025 ఫలితాలు విడుదలయ్యాయి.
DEE CET Results | హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన డీఈఈసెట్-2025 ఫలితాలు విడుదలయ్యాయి. 2025 – 28 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు మే 25న ఆన్లైన్లో నిర్వహించిన పరీక్ష ఫలితాలను అధికారులు గురువారం విడుదల చేశారు. ఈ సారి 78.18 శాతం విద్యార్థులు ఈ పరీక్షలో క్వాలిఫై అయ్యారు. మొత్తం 48,815 మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 33,321 మంది పరీక్షరాస్తే, వీరిలో 28,442 మంది (78.18శాతం) అర్హత సాధించినట్లు అధికారులు వెల్లడించారు..
టాపర్లు వీరే..
మీడియం వారిగా టాపర్లను పరిశీలిస్తే తెలుగు మీడియంలో 77 మార్కులతో తక్కళ్లపల్లి హరిత స్టేట్ టాపర్‌గా నిలిచారు. ఇంగ్లీష్ మీడియంలో 87 మార్కులతో పసునూరి అభినవ రెడ్డి, ఉర్దూ మీడియంలో 67 మార్కులతో ఫరాజ్ ఆహ్మద్‌లు టాపర్లుగా నిలిచారు. మీడియం వారిగా తీసుకుంటే తెలుగు మీడియంలో 19,900 మంది విద్యార్థులకు 15,478 మంది పరీక్షకు హాజరుకాగా, వీరిలో 11,288 (72.79శాతం) క్యాలిఫై అయ్యారు. ఇంగ్లీష్ మీడియంలో 22,051 మంది దరఖాస్తు చేసుకోగా, 18,983 మంది పరీక్ష రాయగా, 14,848 (38,94శాతం) క్వాలిఫై అయ్యారు. ఉర్దూమీడియంలో 1,884 మందికి 1,982 మంది పరీక్షరాస్తే, వీరిలో 530 మంది అర్హతసాధించారు.
19 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్
డీఈఐఈడీ, డీపీఎస్ఈ కోర్సుల్లోని సీట్ల భర్తీ కౌన్సెలింగ్ ఈ నెల 9 నుంచి ప్రారంభంకానుంది. ఈ నెల 9 నుంచి 13 వరకు రాష్ట్రంలోని 10 డైట్ కాలేజీల్లో అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ఈ నెల 14 నుంచి 17 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా 50కి పైగా డైట్ కాలేజీల్లో నాలుగువేల వరకు సీట్లున్నట్లు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

