హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు. ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు నిర్ణయం సరికాదన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుపై తీవ్రంగా మండిపడ్డారు.
విద్యార్థులకు మౌలిక వసతుల కల్పన వదిలేసి పేర్లు మార్చడం అర్థంలేని చర్యగా పేర్కొన్నారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి వైఎస్ఆర్కు ఏం సంబంధం? అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. సీఎం జగన్కు తండ్రిపై అంత ప్రేమ ఉంటే ఏదైనా కొత్త సంస్థకు పేరు పెట్టుకోండి అని సుజనా చౌదరి సూచించారు. ఏ ఆత్మతో మాట్లాడి జగన్రెడ్డి ఎన్టీఆర్ పేరు మార్చారో చెప్పాలని, మేం వస్తే మళ్లీ ఎన్టీఆర్ పేరు పెడ్తామని లోకేశ్ వ్యాఖ్యానించారు. జగన్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హితవు పలికారు.