Karimnagar | పక్కింటి వ్యక్తిని పెండ్లి చేసుకున్న కూతురు.. అత్తారింటికి దారి లేకుండా గోడ కట్టిన తల్లిదండ్రులు
పక్కింటి వ్యక్తిని ప్రేమపెండ్లి చేసుకున్న కూతురుపై తల్లిదండ్రులు కోపం పెంచుకున్నారు. దీంతో పొరుగింటికి దారి లేకుండా సీసీరోడ్డుపై సిమెంట్ ఇంటుకలతో గోడకట్టిన ఘటన కరీంనగర్ (karimnagar) జిల్లాలో చోటుచేసుకున్నది.
కరీంనగర్: పక్కింటి వ్యక్తిని ప్రేమపెండ్లి చేసుకున్న కూతురుపై తల్లిదండ్రులు కోపం పెంచుకున్నారు. దీంతో పొరుగింటికి దారి లేకుండా సీసీరోడ్డుపై సిమెంట్ ఇంటుకలతో గోడకట్టిన ఘటన కరీంనగర్ (karimnagar) జిల్లాలో చోటుచేసుకున్నది. జిల్లాలోని శంకరపట్నం మండలం ఎరడపల్లి గ్రామానికి చెందిన మమత తమ పొరుగింట్లో ఉండే కనకం రత్నాకర్‌ను గతేడాది ఫిబ్రవరి 16న ప్రేమ పెండ్లి చేసుకున్నది. అయితే వారి వివాహం మమత తల్లిదండ్రులకు ఇష్టం లేదు. దీంతో మమత, రత్నాకర్ దంపతులు కేశపట్నంలోని ఓ ఇంట్లో కిరాయికి ఉంటున్నారు. రత్నాకర్ తల్లిదండ్రులు మాత్రం ఎరడపల్లిలోనే నివసిస్తున్నారు.
కాగా, మమత తమ తల్లిగారి ఇంటి మీదుగానే రత్నాకర్ ఇంటికి వెళ్లాల్సి ఉంది. దీంతో రత్నాకర్ కుటుంబం ఆ దారిగుండా నడవకుండా మమత కుటుంబ సభ్యులు ఆరు నెలల క్రితం రోడ్డుపై అడ్డంగా సిమెంట్ ఇటుకలతో గోడ కట్టారు. ఈనేపథ్యంలో అప్పటి నుంచి దొడ్డిదారి గుండా వారు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే తన అత్తగారింటికి వెళ్లేందుకు దారి లేకుండా చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తన తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలని నాలుగు రోజుల క్రితం కేశవపట్నం పోలీసుస్టేషన్లో మమత ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

