Dasyam Vnay Bhaskar | కడియం నమ్మక ద్రోహి.. ఎంతో మందిని బలిపశువులను చేశాడు: దాస్యం వినయ్ భాస్కర్
కడియం శ్రీహరి కోసం బీఆర్ఎస్ చాలా మంది నాయకులను కోల్పోయిందని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ (Dasyam Vnay Bhaskar) విమర్శించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను కాదని కడియానికి స్టేషన్ ఘన్పూర్ టికెట్‌ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చారని చెప్పారు.
వరంగల్: కడియం శ్రీహరి కోసం బీఆర్ఎస్ చాలా మంది నాయకులను కోల్పోయిందని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ (Dasyam Vnay Bhaskar) విమర్శించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను కాదని కడియానికి స్టేషన్ ఘన్పూర్ టికెట్‌ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చారని చెప్పారు. పార్టీ నేతలతో కలిసి ఆయన వరంగల్‌లో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీ మారాలన్నారు. కడియం శ్రీహరికి ప్రజాబలం ఉంటే రాజీనామా చేసి గెలవాలని డిమాండ్ చేశారు. ఆయన ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. కడియం ఏ పార్టీలో ఉన్నా కార్యకర్తలను అణచివేశారని ఆరోపించారు. ఆయన ఎంతో మందిని బలిపశువులను చేశారని విమర్శించారు. కడియం కావ్య తీరు బాధ కలిగించిందని చెప్పారు. శ్రీహరి నమ్మక ద్రోహి అని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.
వరంగల్‌లో జరుగుతున్ పరిణామాలకు కడియం బాధులని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. జిల్లా రాజకీయాలను కడియం బ్రష్ఠుపట్టించాని ఫైర్ అయ్యారు. గులాబీ కోటలో చీడపురుగులా కడియం చేరారని విమర్శించారు. ఆయనకు సిగ్గు, శరం ఉంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

కాగా, కడియం శ్రీహరి తన కుమార్తెతో కలిసి పార్టీ మారుతున్నారని తెలియడంతో.. బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శ్రీహరి ఫొటోలను తొలగించారు. ఫెక్సీలపై ఉన్న ఆయన ఫొటోలపై పార్టీ స్టిక్కర్లను అంటించారు. కడియం డౌన్‌డౌన్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.
Live: Warangal BRS Leaders Press Meet https://t.co/PQNw90HgZA
— BRS Party (@BRSparty) March 29, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijayadashami Celebrations | తోడసం వంశస్తుల ఆధ్వర్యంలో ఘనంగా విజయదశమి వేడుకలు
AP News | పట్టుబడ్డ స్మగ్లింగ్ ముఠా.. భారీగా నగదు, బంగారం స్వాధీనం..!
Elon Musk | ఎలాన్ మస్క్ ఆదేశాలతోనే ఉక్రెయిన్‌లో నెమ్మదించిన స్టార్లింగ్ శాటిలైట్ నెట్వర్క్..!
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

