న్యాయం వైపు నిలబడండి
ఎమ్మెల్సీగా నామినేట్ కావటానికి తన న్యాయపోరాటంలో అడ్డురావొద్దని, తనకు సహకరించాలని ప్రొఫెసర్ కోదండరాంకు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్‌కుమార్ విజ్ఞప్తి చేశారు.
- ప్రొఫెసర్ కోదండరాంకు దాసోజు శ్రవణ్ లేఖ
హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీగా నామినేట్ కావటానికి తన న్యాయపోరాటంలో అడ్డురావొద్దని, తనకు సహకరించాలని ప్రొఫెసర్ కోదండరాంకు బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. బుధవారం కోదండరాంకు బహిరం గ లేఖ రాశారు. ‘వెనుకబడిన వర్గాల హకులను కాలరాయాలని రేవంత్‌రెడ్డి కుట్రలు చేస్తుంటే, సహకరించాలని మీకు మనసు ఎలా వచ్చింది? నాలాంటి వెనుకబడ్డ వారికి రాజకీయ అవకాశాలు రావు. వచ్చినా డబ్బుసంచులతో మమ్మల్ని ఓడగొడతారు.
నేను కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని వదులుకోదల్చుకోలేదు. నా న్యాయ పోరాటానికి మద్దతు ఇవ్వండి. ఎమ్మెల్సీగా నేను నియామకం పొందే వరకు తోడ్పాటును అందించాలి’ అని లేఖలో కోరారు. ఉద్యమ వ్యతిరేకి అయిన రేవంత్.. లీగల్ లిటిగేషన్లో తమను ఇరికించి పరోక్షంగా అవమానిస్తున్న విష యం బోధపడ టం లేదా? అని ప్రశ్నించారు.
‘మీకు కచ్చితంగా పదవి దక్కాలి. రేవంత్‌రెడ్డికి కృతజ్ఞత ఉంటే.. రాజ్యసభకు పంపించి ఉండొచ్చు. ఎమ్యెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా నియమించి ఉండొచ్చు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించి, ఆర్నెల్లలోపు ఎమ్మెల్సీగా నియమించి ఉండొచ్చు. ఎమ్మెల్సీ నియామకాలు వచ్చే వరకు మంత్రిగా కొనసాగించి ఉండొచ్చు కదా’ అని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

