Basara | 3 నుంచి బాసరలో దసరా ఉత్సవాలు.. పలు సేవలు రద్దు
చదువుల తల్లి కొలువై ఉన్న బాసర (Basara) శ్రీ సరస్వతీ ఆలయం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతున్నది. వచ్చే నెల 3 నుంచి 12 వరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
బాసర: చదువుల తల్లి కొలువై ఉన్న బాసర (Basara) శ్రీ సరస్వతీ ఆలయం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతున్నది. వచ్చే నెల 3 నుంచి 12 వరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు తొమ్మిది రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం రోజున అక్షర శ్రీకర పూజలు జరిపిస్తే చిన్నారులు ఉన్నత విద్యావంతులు అవుతారని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా పలు సేవలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈఓ తెలిపారు.
నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారు తొమ్మిది రూపాలలో భక్తులకు దర్శనమిస్తారు. మొదటి రోజైన అక్టోబర్ 3న శైలపుత్రిగా, రెండో రోజు బ్రహ్మచారిణి, మూడో రోజు చంద్రగంట, నాలుగో రోజైన అక్టోబర్ 6న కూష్మాండ అవతారం, ఐదో రోజు స్కందమాత, ఆరో రోజు కాత్యాయని అవతారం, ఏడో రోజు కాళరాత్రి అలంకారం, ఎనిమిదో రోజు మహా గౌరీ, తొమ్మిదో రోజు సిద్ధ ధాత్రి అలంకారం భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ తొమ్మిది రోజులూ ఆలయ అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవార్లకు ఒక్కో నైవేద్యాన్ని సమర్పిస్తారు.
రద్దు చేసిన సేవలు ఇవే..
- అక్టోబర్ 3 నుంచి 11 వరకు అభిషేకాలు
- అక్టోబర్ 9న అక్షరాభ్యాసం తప్ప మిగతా ఆర్జిత సేవలు, వీఐపీ పాస్‌లు రద్దు
- అక్టోబర్ 11 నుంచి 13 భక్తులు నిర్వహించే చండీహోమం
- అక్టోబర్ 12న ఉదయం 10 గంటల వరకు అక్షరాభ్యాసాలు రద్దు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stepson Kills Stepmother | సవతి తల్లిపై డీజిల్ పోసి.. నిప్పంటించిన సవతి కుమారుడు
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి
Raihan Vadra: ఎగ్జిబిషన్ నుంచి ప్రియాంకా గాంధీ కుమారుడి 75 ఫోటోలు తొలగింపు
Farmers | జనరేటర్‌కు ఒక్క రోజుకే రూ.7 వేలు ఖర్చు పెట్టినం.. హరీశ్ రావుతో రైతు ఆవేదన
Sanju Samson: సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

