Maoist party | మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా దామోదర్
Maoist party | మావోయిస్టు పార్టీ(Maoist party) తెలంగాణ(Telangana) రాష్ట్ర కార్యదర్శిగా ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి ప్రాంతానికి చెందిన మిలటరీ చీఫ్ బడే చొక్కారావు(Bade Chokka Rao) అలియాస్ దామోదర్(Damodar) అలియాస్ మల్లన్నను ఆ పార్టీ నియమించింది.
కొత్తగూడెం క్రైం, జనవరి 9 : మావోయిస్టు పార్టీ(Maoist party) తెలంగాణ(Telangana) రాష్ట్ర కార్యదర్శిగా ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి ప్రాంతానికి చెందిన మిలటరీ చీఫ్ బడే చొక్కారావు(Bade Chokka Rao) అలియాస్ దామోదర్(Damodar) అలియాస్ మల్లన్నను ఆ పార్టీ నియమించింది. ఇటీవలే ఆయన కేంద్ర కమిటీ సభ్యుల సమక్షంలో పూర్తి బాధ్యతలు స్వీకరించినట్లు సమాచారం. మావోయిస్టు పార్టీ మళ్లీ తన ఉనికిని చాటుకోవడంతోపాటు తెలంగాణలో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం కేంద్రంగా మావోయిస్టులు తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ.. అప్పుడప్పుడు అలజడులు సృష్టిస్తూ వస్తున్నారు. అయితే మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించిన యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కోవిడ్ బారినపడి 21, జూన్ 2021లో మృతిచెందిన విషయం విదితమే. దీంతో అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి స్థానాన్ని భర్తీ చేసేందుకు ఆ పార్టీ కట్టుదిట్టమైన వ్యూహాలు రచించింది. ఈ స్థానాన్ని దక్కించుకునేందుకు మావోయిస్టు నేత ఆజాద్ సైతం తనవంతు ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది.
చివరికి మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా మిలటరీ చీఫ్ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ అలియాస్ మల్లన్నను నియమించింది. ఇటీవల మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు, ఏఓబీ రాష్ట్ర జోనల్ కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ గణేశ్, ఒడిశా రాష్ట్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సాయన్న, కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, పీఎల్జీఏ బెటాలియన్ కమాండర్ మడివి హిడ్మా అలియాస్ హిద్మాతోపాటు మరికొందరు కీలక నేతలతో జరిగిన సమావేశంలో బడే చొక్కారావుని తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా నియమించినట్లు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

