దళిత సర్పంచ్‌పై కుల వివక్ష
ములుగు జిల్లా వెంకటాపూర్ మండ లం నర్సింగపూర్ దళిత మహిళా సర్పంచ్ బ తుకమ్మ సాక్షిగా కులవివక్ష ఎదుర్కొన్నది. 2005 స్థానిక ఎన్నికల్లో నర్సింగాపూర్ గ్రామపంచాయతీ ఎస్సీ మహిళకు రిజర్వు కాగా, గ్రామానికి చెందిన దళిత మహిళ మడిపెల్లి రాజేశ్వరి అన్ని పార్టీల మద్దతుతో సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాల కోసం గ్రామం లో ఘనమైన ఏర్పాట్లు చేశారు.
- తమతో కలిసి బతుకమ్మ ఆడవద్దన్న మహిళలు
- ములుగు జిల్లా నర్సింగాపూర్‌లో ఘటన
- పండుగపూట కంటతడి పెట్టిన మహిళా సర్పంచ్
ములుగు, అక్టోబర్ 19 (నమస్తేతెలంగాణ): ములుగు జిల్లా వెంకటాపూర్ మండ లం నర్సింగపూర్ దళిత మహిళా సర్పంచ్ బ తుకమ్మ సాక్షిగా కులవివక్ష ఎదుర్కొన్నది. 2005 స్థానిక ఎన్నికల్లో నర్సింగాపూర్ గ్రామపంచాయతీ ఎస్సీ మహిళకు రిజర్వు కాగా, గ్రామానికి చెందిన దళిత మహిళ మడిపెల్లి రాజేశ్వరి అన్ని పార్టీల మద్దతుతో సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాల కోసం గ్రామం లో ఘనమైన ఏర్పాట్లు చేశారు.
ఆదివారం బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనేందుకు కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి నెత్తిన బతుకమ్మతో బయలుదేరిన సర్పంచ్ రాజేశ్వరిని బతుకమ్మ ఆడనీయకుండా పలువురు మహిళలు అడ్డుకున్నారు. వేడుకల వద్ద ఎదురైన ఈ కులవివక్ష సర్పంచ్‌ను కంటతడి పెట్టేలా చేసింది. విషయం తెలుసుకున్న ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు జన్ను రవి, ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి కాడపాక శ్యామ్, దళిత సంఘాల నాయకులు సర్పంచ్ రాజేశ్వరిని అవమానించిన బీసీ మహిళలపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని సోమవారం వెంకటాపూర్ ఎస్సైకి ఫిర్యాదు చేశారు.ఈ మేరకు పోలీసులు సదరు మహిళలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
తమతో కలిసి బతుకమ్మ ఆడవద్దన్నారు
బతుకమ్మను పట్టుకొని గ్రామంలో ఆడే ఆట స్థలం వద్దకు మా చెల్లెను తీసుకొని పోయిన. గ్రామానికి చెందిన కొంద రు మహిళలు బతుకమ్మలను కింద పెట్టి ఆడుతుండగా నేనూ కూడా బతుకమ్మను పెడుతుండగా అక్కడ ఉన్న మహిళలు వాళ్ల బతుకమ్మలతో కలిపి పెట్టనివ్వలేదు. మీకులంలో బతుకమ్మ ఎక్కడిదని అనడంతో నేను పక్కన ఉండిపోయాను. తల పై ఉన్న బతుకమ్మ కింద కూలిపోవడంతో చాలా బాధపడ్డా. కుటుంబ సభ్యులు ఈ విషయం వెంకటాపూర్ ఎస్సైకి చెప్పగా ఆ యన వారితో మాట్లాడారు. అనంతరం ఎస్సై నన్ను తీసుకెళ్లి బతుకమ్మను నిమజ్జనం చేయించి సముదాయించారు. నిరు డు కూడా మా వాళ్లు ఆడేందుకు వెళ్ల గా వాళ్లు అడ్డుకున్నారు. సోమవారం దళిత నాయకులు వచ్చి విషయాన్ని మందకృష్ణ మాదిగతో ఫోన్లో మాట్లాడించగా న్యా యం కోసం పోరాడుదామని చెప్పారు.
– మడిపెల్లి రాజేశ్వరి, బాధిత సర్పంచ్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

