‘అర్ణబ్’తో కోస్తాంధ్రకు వణుకు వాతావరణ శాఖ హైఅలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి ‘అర్ణబ్' తీవ్ర తుఫానుగా మారనున్నదని వాతావరణ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించింది.
హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి ‘అర్ణబ్’ తీవ్ర తుఫానుగా మారనున్నదని వాతావరణ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్ర జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ హై అలర్ట్ ప్రకటించింది. విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అంచనా ప్రకారం.. ఈ తుఫాను కాకినాడ-నర్సాపురం మధ్య కోనసీమ ప్రాంతం గుండా తీరందాటే పరిస్థితులు ఉన్నాయ ని తెలిపింది.
తుఫాను తీరం దాటే సమయంలో గంటకు దాదాపు 140 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. తుఫాను తీవ్రత కారణంగా కోస్తాంధ్ర వ్యాప్తంగా కుంభ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నదని, కొన్ని ప్రాంతాల్లో 20 సెం.మీకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నదని తెలిపిం ది. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తం గా ఉండాలని సూచించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

