టీ న్యూస్ యూట్యూబ్ చానల్‌పై సైబర్ దాడి.. ఆఫీస్ సర్వర్లలో డాటా మాయం
తెలంగాణ ప్రజలపక్షాన నిలుస్తూ వార్తలు ప్రసారం చేస్తున్న.. తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా పేరుగాంచిన ‘టీన్యూస్, నమస్తే తెలంగాణ’పై సైబర్ దాడులు కలవరపెడుతున్నాయి.
- సైబర్ క్రైమ్ పోలీసులకు యాజమాన్యం ఫిర్యాదు
- నిరుడు ‘నమస్తే తెలంగాణ’పై కూడా..
హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజలపక్షాన నిలుస్తూ వార్తలు ప్రసారం చేస్తున్న.. తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా పేరుగాంచిన ‘టీన్యూస్, నమస్తే తెలంగాణ’పై సైబర్ దాడులు కలవరపెడుతున్నాయి. గతేడాది ‘నమస్తే తెలంగాణ’ సర్వర్లపై సైబర్ నేరస్తుల దాడిని మరువకముందే.. ‘టీ న్యూస్’ యూట్యూబ్ సర్వర్లపై దాడి చేశారు. శుక్రవారం అర్ధరాత్రి సైబర్ అటాక్ జరిగినట్టు గుర్తించిన ‘టీ న్యూస్’ యాజమాన్యం శనివారం ఉదయం సైబర్ క్రైమ్ డీసీపీకి ఫిర్యాదు చేసింది. ప్రజలకు ‘టీ న్యూస్’ ప్రసారాలు చేరకుండా కుట్ర చేస్తున్నారని, ఈ ఘటనతో చానల్ ప్రసారాలకు అంతరాయం ఏర్పడినట్టు తెలిపింది.
దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని యాజమాన్యం డిమాండ్ చేసింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డీజీపీకి విజ్ఞప్తి చేసినట్టు పేరొంది. సాధ్యమైనంత త్వరగా ‘టీ న్యూస్’ యూట్యూబ్ సేవలను తిరిగి ప్రజల ముందుకు తీసుకొస్తామని ప్రకటించింది. ప్రజలపక్షాన నిలుస్తూ, ప్రభుత్వ తీరును ఎండగడుతున్న ‘టీ న్యూస్, నమస్తే తెలంగాణ’పై సైబర్ దాడులు జరుగుతుండటం పలు అనుమానాలకు తావిస్తున్నదని సైబర్ నిపుణులు అంటున్నారు. వీటిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

