5జీ పేరుతో సైబర్ మోసాలు
దేశంలో ఐదో తరం (5జీ) టెలికం సేవలు ప్రారంభం కావడంతో ఇదు అదనుగా దానిని అడ్డం పెట్టుకొని సైబర్ కేటుగాళ్లు సరికొత్త మోసాలకు తెరలేపుతున్నారు. 5జీ టెక్నాలజీకి అప్‌గ్రేడ్ కావాలంటూ మొబైల్ ఫోన్ల వినియోగదారులకు సైబర్ నేరగాళ్లు వివిధ రకాల లింకులతో కూడిన ఎస్ఎంఎస్లు, ఈ-మెయిళ్లు పంపుతున్నారు
హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): దేశంలో ఐదో తరం (5జీ) టెలికం సేవలు ప్రారంభం కావడంతో ఇదు అదనుగా దానిని అడ్డం పెట్టుకొని సైబర్ కేటుగాళ్లు సరికొత్త మోసాలకు తెరలేపుతున్నారు. 5జీ టెక్నాలజీకి అప్‌గ్రేడ్ కావాలంటూ మొబైల్ ఫోన్ల వినియోగదారులకు సైబర్ నేరగాళ్లు వివిధ రకాల లింకులతో కూడిన ఎస్ఎంఎస్లు, ఈ-మెయిళ్లు పంపుతున్నారు. సైబర్ నేరగాళ్లు తాము పంపిన లింకులను క్లిక్ చేయాలని, ఆ తర్వాత వచ్చే ఓటీపీ వివరాలను తమకు చెప్తే సిమ్‌కార్డును అప్‌గ్రేడ్ చేస్తామని మొబైల్ వినియోగదారులతో నమ్మబలుకుతున్నారు. ఇదంతా నిజమేనని నమ్మితే దారుణంగా మోసపోవడం ఖాయమని, ఆ కేటుగాళ్లు చెప్పినట్టు చేస్తే మీ బ్యాంకు ఖాతాలు లూటీ అయ్యే ప్రమాదం ఉన్నదని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ఇలా చేస్తే మీరు సేఫ్
- 5జీ సేవల పేరుతో వచ్చే ఎస్‌ఎంఎస్‌లలోని లింకులను క్లిక్ చేయవద్దు. అప్‌గ్రేడేషన్ పేరిట ఎవరైనా మన ఫోన్‌కు ఓటీపీలు పంపి ఆ వివరాలను చెప్పమంటే దాన్ని సైబర్‌నేరగాళ్ల పనిగా గుర్తించాలి.
- 5జీ సేవలను పొందాలనుకొనేవారు నేరుగా తమ సర్వీస్ ప్రొవైడర్ స్టోర్‌ను సంప్రదించాలి.
సైబర్ నేరగాళ్లపై సీబీఐ దాడులు
న్యూఢిల్లీ, అక్టోబర్ 4: దేశవ్యాప్తంగా సైబర్ నేరాలపై సీబీఐ ఉక్కుపాదం మోపింది. ఆపరేషన్ చక్రలో భాగంగా పలు రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 105చోట్ల మంగళవారం దాడులు నిర్వహించింది. స్థానిక పోలీసు బృందాల సహకారంతో నిర్వహించిన ఈ దాడుల్లో పలు డిజిటల్ ఆధారాలతోపాటు రూ. 1.5కోట్ల నగదు, 1.5 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నది. 87 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు, 18 ప్రాంతాల్లో ఆయా రాష్ర్టాల పోలీసులు సోదాలు నిర్వహించారు. 300 మంది అనుమానితులను విచారించారు. అమెరికన్ పౌరులను మోసం చేస్తున్న పుణె, అహ్మదాబాద్‌లోని రెండు కాల్సెంటర్లపై సీబీఐ దాడులు నిర్వహించింది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు తెలియజేసినట్టు సీబీఐ అధికారవర్గాలు తెలిపాయి. ఇంటర్‌పోల్, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ), రాయల్ కెనెడియన్ మౌంటెన్ పోలీస్, ఆస్ట్రేలియా పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

