Godavari Floods | ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి : సీఎస్
హైదరాబాద్ : గోదావరి నదికి వరద పోటెత్తుతున్నది. చరిత్రలో రెండోసారి 70 అడుగులను మించి ప్రవహిస్తున్నది. ప్రస్తుతం గోదావరిలో 24.18లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా.. మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నది. వరద మరింత పెరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. భద్రాద్రి కలెక్టర్, ఎస్పీ సీఎస్ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, సీఎస్ సోమేశ్‌కుమార్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నీటిపారుదలశాఖ అధికారులు టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
భద్రాచలంలో కొనసాగుతున్న వరదలు, సహాయ, పునరావాస చర్యలపై సమీక్షించారు. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, సింగరేణి, రెస్క్యూ బృందాలను బృందాలను భద్రాచలం, కొత్తగూడెంలో అందుబాటులో ఉంచాలని మంత్రి ఆదేశించారు. సీఎస్ సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలన్నారు. నీటిమట్టం 80 అడుగులకు చేరినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే శిబిరాలకు తరలించాలని సూచించారు.
పది ఎన్డీఆర్ఎఫ్, ఐదు ఆర్మీ, సింగరేణి బృందాలు భద్రాచలంలో ఉన్నాయని తెలిపారు. వరదల వల్ల ప్రాణ, ఆస్తినష్టం జరుగకుండా చూడాలన్నారు. రాత్రికి ఐటీసీ భద్రాచలంలో హెలికాప్టర్ అందుబాటులో ఉంటుందని సీఎస్ పేర్కొన్నారు. రాత్రికి నాలుగు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుంటాయని చెప్పారు. భద్రాచలానికి బోటు, బస్సులు, ట్రక్కులు పంపుతున్నట్లు తెలిపారు. సహాయ, పునరావాస చర్యల పర్యవేక్షణ కోసం సీనియర్ పోలీసు అధికారులను నియమించినట్లు డీజీపీ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

