వడ్ల సేకరణకు కార్యాచరణ రూపొందించండి.. సీఎస్ ఆదేశం
హైదరాబాద్ : యాసంగింలో పండించిన మొత్తం వరి ధాన్యాన్ని రాష్ట్రమే పూర్తిగా కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వడ్ల సేకరణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
ధాన్యం కొనుగోళ్ల పురోగతిని జిల్లాల వారీగా ప్రతీ రోజూ పర్యవేక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. తక్షణమే మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి జిల్లాల్లో ధాన్యం సేకరణకు చర్యలు ప్రారంభించాలని చెప్పారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు రోజూ కనీసం నాలుగు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని ఆదేశించారు.
గతంలో కంటే అధికంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎస్ ఆదేశించారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి ప్రత్యేక అధికారిని నియమించి, పర్యవేక్షించాలన్నారు. గన్నీ బ్యాగుల సేకరణపై కూడా దృష్టి సారించాలని చెప్పారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఏవైనా సమస్యలు వస్తే అధికారులు వెంటనే పరిష్కరించాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని రవాణా చేసేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు మరో ఉద్యమం చేపట్టాలి : బొల్లం మల్లయ్య యాదవ్
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
Gentleman | 33 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి శంకర్ ‘జెంటిల్మెన్’.. డిసెంబర్ 11న 4కే వెర్షన్‌తో గ్రాండ్ రీ రిలీజ్!
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

