పరిశోధనాత్మక రచనలు రావాలి : సీఎస్ సోమేశ్‌కుమార్
CS Somesh Kumar | ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఆర్థిక, సామాజిక, అభివృద్ధి రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అన్నారు. ప్రస్తుత తెలంగాణాలను పోల్చుతూ మరింత పరిశోధనాత్మక రచనలు వెలువడాల్సిన
హైదరాబాద్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ఆర్థిక, సామాజిక, అభివృద్ధి రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అన్నారు. ప్రస్తుత తెలంగాణాలను పోల్చుతూ మరింత పరిశోధనాత్మక రచనలు వెలువడాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్కే భవన్‌లోని తన కార్యాలయంలో అడపా సత్యనారాయణ, డాక్టర్ ద్యావనవెళ్లి సత్యనారాయణ రాసిన ‘తెలంగాణ హిస్టరీ, కల్చర్, మూవ్మెంట్స్’ అనే పుస్తకాన్ని సీఎస్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి మూలకు చరిత్ర ఉంటుందని సీఎం కేసీఆర్ అంటుంటారని, ఈ గ్రంథంలోని చారిత్రక అంశాలను చూస్తే మరోసారి నిరూపిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు తెలంగాణ చరిత్రను 2వేల సంవత్సరాల క్రితం నుంచి ప్రారంభమైందని చెబుతూ వస్తున్నారని, కానీ తెలంగాణ భూభాగంలో 18 లక్షల సంత్సరాల క్రితం నుంచే ఆది మానవులు ఎదుగుతూ వచ్చారన్నారు. ఆ పరిణామ క్రమంతో పాటు ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాల చరిత్రను సమగ్రంగా విశ్లేషిస్తూ ‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాల’ను ప్రత్యేకంగా వివరిస్తూ విషయ నిపుణులు అడపా సత్యనారాయణ, ద్యావనపల్లి సత్యనారాయణ ఆంగ్లంలో ‘తెలంగాణ హిస్టరీ, కల్చర్ అండ్ మూవ్మెంట్స్’ను సాధికారికంగా రాయడం అభినందనీయమని సీఎస్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఇక్కడి చరిత్ర, సంస్కృతీ, సామాజిక వ్యవస్థ ను విశ్లేషిస్తూ పెద్ద ఎత్తున సాహిత్యం పుస్తకరూపంలో వస్తున్నప్పటికీ, ఇది మరింత ఎక్కువగా రావాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రంలో దాదాపు 90వేలకుపైగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఈ కాంపిటీటివ్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఈ గ్రంధం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. తెలంగాణ చరిత్రను వక్రీకరించేవిధంగా పలు సినిమాలు వస్తున్నాయని, ఇదే కోవలో మరికొన్ని సినిమాలు వచ్చే అవకాశమున్నందున తెలంగాణ చారిత్రిక, సాంస్కృతిక, సామాజిక అంశాలపై ఇలాంటి సాధికారిక గ్రంధాలు రావాల్సిన అవసరముందని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు.
సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్ మాట్లాడుతూ, వివిధ రాష్ట్రాల చరిత్ర కారులకు తమ రాష్ట్ర చరిత్ర రచనకు ఈ గ్రంధం ప్రామాణికంగా ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, ప్రొఫెసర్ కిశోర్, తెలంగాణ పబ్లికేషన్స్ కార్యదర్శి చంద్ర మోహన్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

