ఆజాదీ కా అమృత్ మహోత్సవ్.. ఫ్రీడం రన్ ప్రారంభించిన సీఎస్

హైదరాబాద్: ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్‌లో స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీడమ్ రన్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పీపుల్స్ ప్లాజా వద్ద ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్లు అంజనీకుమార్, సజ్జనార్ పాల్గొన్నారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఎల్బీ స్టేడియం వరకు 3కే రన్ నిర్వహించారు. ఇందులో 1500 మంది విద్యార్థులు, వాకర్లు పాల్గొన్నారు.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఫ్రీడమ్ రన్‌ను జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ ప్రారంభించారు. ఎందరో త్యాగధనుల ఆత్మబలిదానాలతో సాధించుకున్న స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ల మీదుగా సాగిన ఈ రన్లో జిల్లా అధికారులు, యువకులు, క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, స్థానికులు పాల్గొన్నారు.

పెద్దపల్లి జిల్లాలో ప్రీడం రన్‌ను ఘనంగా నిర్వహించారు. అమృత్ మహోత్సవ్‌లో భాగంగా జిల్లా కేంద్రంలో 2కే రన్‌ను కలెక్టర్ సంగీత సత్యనారాయణ ప్రారంభించారు. ఏడాదిపాటు కొనసాగే ఈ కార్యక్రమాల్లో జిల్లా వ్యాప్తంగా ప్రజలు పాల్గొనాలని ఆమె కోరారు.

వనపర్తి జిల్లాలో జరిగిన ఫ్రీడమ్ రన్‌ను కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, ఎస్పీ అపూర్వ రావు జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలోని పాలిటెక్నిక్ కాలేజీ నుంచి బస్టాండ్ మీదుగా ఎకోపార్క్ వరకు ఈ రన్ కొనసాగింది. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులు స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలో పాల్గొన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎస్పీ రాహుల్ హెగ్డే, కరీంనగర్ జిల్లాలో జడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆర్డీవో శ్రీనివాస్, ములుగు జిల్లాలో కలెక్టర్ కృష్ణ ఆధిత్య ప్రారంభించారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
Harish Rao | గడ్డిపోతారం పారిశ్రామికవాడ ప్రమాదంపై హరీశ్‌రావు దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

