Rajeev Sagar | నిధులు తీసుకువచ్చే దమ్ములేక బీజేపీ నేతలు విమర్శలు : మేడే రాజీవ్ సాగర్
Rajeev Sagar | తెలంగాణ అభివృద్ధికి నిధులు తీసుకువచ్చే దమ్ములేక బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ (Rajeev Sagar ) బీజేపీ నాయకులపై మండి పడ్డారు.
హైదరాబాద్ : తెలంగాణ అభివృద్ధికి నిధులు తీసుకువచ్చే దమ్ములేక బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ (Rajeev Sagar ) బీజేపీ నాయకులపై మండి పడ్డారు. రైతు వ్యతిరేక(Anti Farmers) విధానాలకు పాల్పడుతున్న ఆ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. తెలంగాణలో అమలు అవుతున్న రైతు పథకాలను మోదీ (Narendera Modi) సర్కార్ కాపీ కొడుతుందని విమర్శించారు.
బీఆర్ఎస్ (BRS) పార్టీని తిట్టడంలో పోటీ పడుతున్న బీజేపీ నేతలు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో ఎందుకు పోటి పడడం లేదని ప్రశ్నించారు. అసలు రైతులకు బీజేపీ (BJP) పార్టీ ఏం చేసిందని ఖమ్మంలో రైతు సభ పెట్టారని ఆరోపించారు. రైతులకు బీజేపీ చేసిన మేలు ఏమి లేకపోవడంతో అమిత్ షా (Amit Shah) కేసీఆర్ పై అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా రైతుబీమా రాష్ట్రంలో అమలవుతుందని తెలిపారు. తెలంగాణ రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతుబంధు పథకానికి శ్రీకారం చుడితే దీనినే ఆదర్శంగా తీసుకుని కేంద్రంలో కిసాన్ సమ్మాన్ యోజన పథకం తీసుకువచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. రైతు వ్యతిరేక బిల్లులు తీసుకురావాలని చూసిన నీచమైన చరిత్ర బిజేపీ పార్టీదని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

