CP Radhakrishnan | తెలంగాణ గవర్నర్‌గా రేపు సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం
CP Radhakrishnan | తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ నియామకమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం రాత్రికి రాధాకృష్ణన్ హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.
CP Radhakrishnan | హైదరాబాద్ : తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ నియామకమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం రాత్రికి రాధాకృష్ణన్ హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. బుధవారం ఉదయం 11:15 గంటలకు సీపీ రాధాకృష్ణన్ తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాధాకృష్ణన్ చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయించనున్నారు. గవర్నర్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లలో రాజ్‌భవన్ వర్గాలు నిమగ్నమయ్యాయి.
జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు.. తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించిన సంగతి తెలిసిందే. తమిళిసై గవర్నర్ పదవికి రాజీనామా చేయడంతో ఆ బాధ్యతలను రాధాకృష్ణన్‌కు అప్పగించినట్లు రాష్ట్రపతి భవన్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. పూర్తి స్థాయి గవర్నర్లను నియమించే వరకు తెలంగాణ, పుదుచ్చేరి బాధ్యతలను నిర్వర్తించాలని రాధాకృష్ణన్‌ను కోరుతూ రాష్ట్రపతి భవన్ ఓ లేఖ రిలీజ్ చేసింది. బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి నియామకం అమలులోకి వస్తుందని రాష్ట్రపతి భవన్ ఆ రిలీజ్లో తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

