అనాథ పిల్లలకు కార్పొరేట్ విద్య

- శిశు సంక్షేమ మంత్రి సత్యవతి
- హైదరాబాద్లో వీధి బాలల వసతిగృహాల ప్రారంభం
హైదరాబాద్, సైదాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అనాథ పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్య, వైద్య సదుపాయం కల్పిస్తున్నామని మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో అనాథ పిల్లల సంరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.7 కోట్లతో సైదాబాద్, నింబోలిఅడ్డలో నూతనంగా నిర్మించిన వీధి బాలుర, బాలికల వసతి గృహాల సముదాయాలను శుక్రవారం హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్లతో కలిసి మంత్రి సత్యవతి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పోలీసుశాఖ ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా నాలుగు వేల మంది బాల కార్మికులకు విముక్తి కల్పించగా, వారిలో వేయి మందిని ప్రభుత్వ సదనాల్లో చేర్పించామన్నారు. ప్రభుత్వ అధ్వర్యంలో నడుస్తున్న సదనాలను ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ప్రజా ప్రతినిధులు దత్తత తీసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కాచిగూడలోని నింబోలిఅడ్డాలో రూ.3.60 కోట్లతో 75 మంది విద్యార్థులకు సరిపడే మూడంతస్థుల భవనాన్ని నిర్మించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్, స్థానిక కార్పొరేటర్లు, సదనాల పర్యవేక్షణాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

