Runa Mafi | రుణమాఫీ తీరుపె నిరసనాస్త్రం.. లక్షలోపు రుణాలు పూర్తిగా మాఫీ కాలేదని ఆవేదన
తొలి విడతలో రూ.లక్ష లోపు రుణం మాఫీ కాని రైతులు పోరుబాట పడుతున్నారు. సోమవారం నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎదుట రైతులు నిరసన వ్యక్తంచేశారు.
- బ్యాంకుల ఎదుట రైతుల ఆందోళన
Runa Mafi | నిర్మల్ అర్బన్, జూలై 22: తొలి విడతలో రూ.లక్ష లోపు రుణం మాఫీ కాని రైతులు పోరుబాట పడుతున్నారు. సోమవారం నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామంలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎదుట రైతులు నిరసన వ్యక్తంచేశారు. లక్ష లోపు రుణం తీసుకున్న రైతులకు రూ.60 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు మాత్రమే మాఫీ అయ్యాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. లక్షలోపు తీసుకున్న రుణాలను మాఫీ చేయకుండా ఎందుకు ఆపారో తెలపాలంటూ బ్యాంకు ఎదుట నిరసన చేపట్టారు. దీంతో బ్యాంకు అధికారులు బయటకొచ్చి రైతులతో మాట్లాడారు. హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన మార్గదర్శకాల ప్రకారమే చేశామని తెలిపారు. ఏదైనా సాంకేతిక సమస్యలతో పొరపాటు జరిగి ఉండొచ్చని, పైఅధికారులతో చర్చించి మూడు రోజుల్లో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పడంతో రైతులు శాంతించారు.
70 వేలకు 13 వేలే మాఫీ
ఎస్బీఐ జనగామ బ్రాంచ్ లో రూ.70 వేలపైగా రుణం తీసుకున్న. వడ్డీతో కలిపి రూ. 86 వేలు కావచ్చు. రూ.లక్షలోపు రుణమాఫీకి అర్హుడినై నా నాకు రూ.13,497 మాఫీ అయినట్టు నెల 18న మెసేజ్ వచ్చింది. పూర్తిగా రుణమాఫీ కాలేదు. వ్యవసాయ అధికారికి చెప్తే బ్యాంకుకు వెళ్లి తెలుసుకో అన్నడు. గతంలో నేను తీసుకున్న రుణం పూర్తిగా మాఫీ అయ్యింది. ఇప్పుడేమో ఇట్లయ్యింది.
-దడిగ తిరుపతి, రైతు, గానుగుపహాడ్
రంగారెడ్డి డీసీసీబీలో 22 వేల మందికి మొండిచెయ్యి
- తొలి విడతలొ 11,700 మందికే మాఫీ
రంగారెడ్డి, జూలై 22 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా డీసీసీబీ పరిధిలో రూ.లక్ష లోపు రుణం తీసుకున్న రైతులు సుమారు 34 వేల వరకు ఉన్నారు. అయితే, ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో 11,700 మంది రైతుల పేర్లు మాత్రమే ఉన్నాయి. మిగిలిన 22 వేల మంది రైతులకు మొండిచెయ్యి చూపినట్టేనా? అన్న భావన రైతుల్లో కలుగుతున్నది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు పట్టాదారు పాసుపుస్తకం ఉన్న రైతులందరికీ రూ.2 లక్షలు రుణమాఫీ చేయాలని, భార్యాభర్తలిద్దరినే కుటుంబసభ్యులుగా పరిగణించాలని, వేరుగా ఉంటున్న కుమారులకు కూడా రుణమాఫీ వర్తింపజేయాలని రైతులు కోరుతున్నారు. కొద్దిమందికే మాఫీ చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.
కొర్రీలు లేకుండా రుణమాఫీ చేయాలి
- గానుగపాడు సొసైటీ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి బీఆర్ఎస్ నిరసన
చండ్రుగొండ, జూలై 22: కొర్రీలు, షరతులు పెట్టకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం గానుగపాడు సొసైటీ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు సోమవారం నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ నరుకుళ్ల సత్యనారాయణ మాట్లాడుతూ.. గానుగపాడు సొసైటీలో 2,500 మంది రైతులు ఉంటే.. 500 మందికి, గుంపెన సొసైటీలో 1,800 మందికిగాను 300 మంది రైతులకు మాత్రమే రుణం మాఫీ చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. రైతులందరికీ రుణమాఫీ చేయకపోతే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సొసైటీ చైర్మన్ చెవుల చందర్రావు, సీఈవో లంక నర్సింహారావుకు అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, రైతులు భూపతి రమేశ్, కన్నయ్య, తుపాకుల రాజు, పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

