చట్టం.. వారికి చుట్టమా?
చట్టం.. అధికార పార్టీకి చుట్టంగా మారుతున్నదా?.. రాష్ట్రంలో పోలీసుల తీరు చూస్తుంటే అలానే అనిపిస్తున్నది. దసరా సందర్భంగా రాష్ట్ర పక్షి పాలపిట్టను పంజరాల్లో బంధించడం, హింసించడం సరైంది కాదని, అటువంటి వారి సమాచారమిస్తే కేసులు పెడుతామంటూ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రకటించారు. రెండురోజులుగా పాలపిట్ట విషయంలో హైదరాబాద్ సిటీ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తూ.. నాలుగుచోట్ల పంజరంలో ఉన్న పక్షులను పట్టుకుని సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేశారు.
- పాలపిట్టను పట్టుకున్నందుకు నాలుగుచోట్ల కేసు నమోదు
- ఉప్పల్ రావణ దహనంలో పాలపిట్టను పట్టుకున్న పీసీసీ చీఫ్
- స్థానిక నేతలపై కేసు.. మహేశ్‌గౌడ్‌ను తప్పించిన అధికారులు
- సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్న విమర్శలు
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): చట్టం.. అధికార పార్టీకి చుట్టంగా మారుతున్నదా?.. రాష్ట్రంలో పోలీసుల తీరు చూస్తుంటే అలానే అనిపిస్తున్నది. దసరా సందర్భంగా రాష్ట్ర పక్షి పాలపిట్టను పంజరాల్లో బంధించడం, హింసించడం సరైంది కాదని, అటువంటి వారి సమాచారమిస్తే కేసులు పెడుతామంటూ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రకటించారు. రెండురోజులుగా పాలపిట్ట విషయంలో హైదరాబాద్ సిటీ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తూ.. నాలుగుచోట్ల పంజరంలో ఉన్న పక్షులను పట్టుకుని సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేశారు.
అటవీశాఖ పాలపిట్టను హింసించవద్దంటూ పోస్టర్లు ముద్రించి ప్రచారం చేసింది. పాలపిట్టలను పంజరంలో బంధించడాన్ని నివారించాలని, ఆలయాల్లో కూడా ఈ నిబంధన పాటించేలా చూడాలని ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి వినయ్‌కుమార్ అధికారులను కొద్ది రోజుల క్రితమే ఆదేశించారు. పాలపిట్టను బంధిస్తే సెక్షన్ 51(1) కింద మూడేండ్ల జైలుశిక్ష, రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారని అధికారులు హెచ్చరించారు. అయితే దసరా సందర్భంగా ఉప్పల్ మినీస్టేడియంలో మంగళవారం జరిగిన రావణదహన కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పాలపిట్టను చేతిలో పట్టుకుని ఉన్న వీడియో దుమారం రేపుతున్నది.
పండుగ ఆచారాలంటూ ఈ పక్షిని హింసించవద్దంటూ అటవీశాఖ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వేర్వేరుగా హెచ్చరించినప్పటికీ ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలో మహేశ్‌గౌడ్ సమక్షంలోనే పాలపిట్టను పంజరంలో పెట్టి వేదికపైకి తీసుకురావడం, ఆ తర్వాత ఆ పక్షిని ఆయన చేతికి ఇస్తే దానిని పట్టుకోవడం కనిపించింది. కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేస్తున్నపుడు ఆయన పక్షిని అటూ ఇటూ కదిలిస్తూ హింసించినట్టుగా ఉండడంతో ఈ వీడియో వివాదాస్పదమైంది.
మహేశ్‌గౌడ్ పేరు లేకుండానే కేసు!
మహేశ్‌గౌడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఉప్పల్ మినీ స్టేడియంలో పాలపిట్టను విడుదల చేసిన ఘటనకు సంబంధించి ఉప్పల్‌కు చెందిన ఈగ చంద్రశేఖర్, పీ పరమేశ్వర్‌రెడ్డి, మరికొందరి ప్రమేయం ఉన్నట్టుగా ప్రాథమికంగా గుర్తించినట్టు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అటవీ అధికారి వేణుమాధవ్ ఒక ప్రకటనలో తెలిపారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లోని సంబంధిత సెక్షన్లతో పాటు బీఎన్ఎస్ సెక్షన్ 35 కింద వారిపై కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతున్నదని, విచారణ పూర్తయిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని, నిందితులను సంబంధిత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కీలకమైన పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ పేరు లేకుండానే అటవీ అధికారులు కేసు నమోదు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. అధికారపార్టీ నేత అయి ఉండి ప్రభుత్వశాఖలు చెప్పిన సూచనలు పాటించకుండా, వన్యప్రాణులను హింసించే రీతిలో వ్యవహరించినప్పటికీ మహేశ్‌గౌడ్‌ను ఎందుకు వదిలేశారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

