హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్లోని క్యూర్(కోర్ అర్బన్ రీజియన్ ఎకానమి) పరిధిలో అందుబాటు ధరల్లో ప్లాట్ల నిర్మాణానికి గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి వీపీ గౌతమ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులోభాగంగా దిగువ, మధ్య తరగతి ప్రజల కోసం లక్ష ప్లాట్లు నిర్మించనున్నారు. 70 వేల ప్ల్లాట్లను దిగువ మధ్యతరగతి వారికి, 30 వేల ఇండ్లను మధ్య తరగతి వారికి నిర్మించనున్నట్టు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. క్యూర్ ఏరియాలో పైలెట్ ప్రాజెక్టుగా 12,000 ప్లాట్లు నిర్మించనున్నట్టు స్పష్టం చేసింది. ఎల్ఐజీ(లో-ఇన్కమ్ గ్రూప్) ప్ల్లాట్లకు భూమి, యూడీఎస్, రూ.5 లక్షల సబ్సిడీ ఇవ్వనున్నారు. హౌసింగ్ బోర్డు, దిల్, రాజీవ్ స్వగృహ, ప్రభుత్వ భూముల్లో ప్లాట్ల నిర్మాణం చేపట్టనున్నారు.