సర్పంచ్ టికెట్ ఇవ్వాలని.. కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
సర్పంచ్ టికెట్‌ను తనకే కేటాయించాలంటూ కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యకు యత్నించిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది.
నాగర్‌కర్నూల్ టౌన్, నవంబర్ 30 : సర్పంచ్ టికెట్‌ను తనకే కేటాయించాలంటూ కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యకు యత్నించిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. శ్రీపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త బంగారయ్య సర్పంచ్ స్థానం తన భార్యకు ఇవ్వాలని కోరుతూ నాయకులతో కలిసి ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డిని కలిశాడు. గంట తర్వాత గ్రామ పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుందామని చెప్పినట్టు తెలిసింది. అక్కడి నుంచి వెళ్లిపోయిన కొద్దిసేపటికే బంగారయ్య తన వెంట తెచ్చుకొన్న పురుగుల మందు తాగగా అక్కడున్న వారు అడ్డుకున్నారు. విషయం తెలిసిన ఎమ్మెల్యే అక్కడికి చేరుకొని వెంటనే దవాఖానకు తరలించాలని సూచించగా, నాగర్‌కర్నూల్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. 30 ఏండ్లుగా కాంగ్రెస్‌లో పనిచేస్తున్న బం గారయ్య ఈసారి సర్పంచ్ పదవి తనకే దక్కాలన్న ఆశతో ఈచర్యకు పా ల్పడినట్టు అతడి స్నేహితులు పేర్కొన్నారు.
ఇంకా చదవల్సిన వార్తలు
సర్పంచ్‌గా గెలిపిస్తే..22 గ్యారెంటీలు అమలు చేస్తా ; బాండ్ పేపర్‌పై ఒప్పంద పత్రం
గట్టు, నవంబర్ 30: తనను సర్పంచ్‌గా గెలిపిస్తే 22 గ్యారెంటీలను అమ లు చేస్తానని జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం సల్కాపురం సర్పంచ్ అభ్యర్థి ఆంజనేయులు బాండ్ పేపర్‌పై రాసిచ్చిన ఘటన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో జిల్లాలో వైరల్‌గా మారింది. తాను గెలిచాక గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తానని చెప్పుకొచ్చాడు. లేదంటే ప్రజలే తనను పదవి నుంచి తొలగించే అధికారాలు ఇస్తున్నట్టు అందులో పేర్కొన్నాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

